ఫైర్‌ఫాక్స్ ఎంపికలు, అభిరుచులు, అమరికలు

రివిజన్ సమాచారం
  • రివిజన్ id: 166116
  • సృష్టించబడింది:
  • సృష్టికర్త: చిలాబు
  • వ్యాఖ్య: few changes
  • పరిశీలించినవి: అవును
  • పరిశీలించినవి:
  • సమీక్షించినవారు: chilaabu
  • ఆమోదించబడిందా? అవును
  • ప్రస్తుత రివిజనా? కాదు
  • స్థానికీకరణ కోసం సిద్ధంగా ఉన్నది: కాదు
రివిజన్ మూలం
రివిజన్ కంటెంట్

ఫైర్‌ఫాక్స్ ఎంపికలుప్రాధాన్యతలు ప్యానెళ్ళు, వాటిలో ఉండే అమరికల రకాల గురించి ఈ వ్యాసం టూకీగా చెప్తుంది. మెనూ బొత్తం New Fx MenuFx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి. ఈ క్రింది ప్యానెళ్ళు అందుబాటులో ఉన్నాయి:

సాధారణ ప్యానెలు

ఈ ప్యానెలులో ఈ క్రింది రకాల అమరికలకు ఎంపికలుఅభిరుచులు ఉంటాయి:

సాధారణం
మొదలుపెట్టడం,, ముంగిలి పేజీ మరియు ట్యాబులు: ఇక్కడ మీరు ఫైర్‌ఫాక్స్‌ను మీ అప్రమేయ విహారిణిగా అమర్చుకోవచ్చు, ఫైర్‌ఫాక్స్ ఆరంభమైనపుడు ఏయే పేజీలను తెరవాలి అనేది మార్చుకోవచ్చు, ఫైర్‌ఫాక్స్ ఆరంభమైనపుడు మీ మునుపటి సెషన్ను యధాస్థితికి తెచ్చునట్టు అమర్చుకోవచ్చు మరియు ట్యాబులు లేదా విండోలు ఎలా తెరవాలో ఎంచుకోవచ్చు.

భాష, రూపురేఖలు
ఫాంట్లు & రంగులు మరియు భాష: ఇక్కడ మీరు వెబ్సైట్లు వాడే ఫాంట్లు, రంగులను మార్చవచ్చు, ఒక భాషను ఎంచుకొనవచ్చు మరియు ఫైర్‌ఫాక్స్ అక్షర కూర్పును సరిచూస్తుందో లేదో ఎంచుకోవచ్చు.

దస్త్రాలు, అనువర్తనాలు
దింపుకోళ్ళు, అనువర్తనాలు మరియు డిజిటల్ హక్కుల నిర్వహణ (DRM) కంటెంట్: ఇక్కడ మీరు దస్త్రాలను దాచడం కోసం ఫైర్‌ఫాక్స్ వాడే దింపుకోలు ఫోల్డరును మార్చుట, వివిధ రకాల దస్త్రాలకు ఉపయోగించిన అనువర్తనము లేదా చేసిన క్రియను మార్చుట మరియు DRM కంటెంటును ఫైర్‌ఫాక్స్‌లో చూచుట చేయొచ్చా అనేది ఎంపిక చేసుకొనవచ్చు.

ఫైర్‌ఫాక్స్ తాజాకరణలు
ఇక్కడ మీరు ఫైర్‌ఫాక్స్ యొక్క తాజాకరణ చరిత్రను పరీక్షించవచ్చు లేదా తాజాకరణ అమరికలను మార్చవచ్చు.

పనితనం
ఇక్కడ మీరు ఫైర్‌ఫాక్స్ యొక్క పనితనం అమరికలు మార్చవచ్చు.

విహరణ
ఇక్కడ మీరు స్క్రోలింగ్ అమరికలను ఎంచుకోవడం, కర్సర్‌ని (కేరెట్ విహరణ రీతిలో) ఉపయోగించడం లేదా వెబ్ పేజీల్లో పాఠ్యాన్ని వెదకడం చేయవచ్చు.

నెట్‌వర్క్ ప్రాక్సీ
ఇక్కడ మీరు ఫైర్‌ఫాక్స్ కనెక్షన్ అమరికలు మార్చవచ్చు మరియు జాలకు కలయిక కోసం ఒక ప్రాక్సీని అమర్చుకొనవచ్చు.

ముంగిలి ప్యానెలు

ఈ ప్యానెలు ఈ క్రింది రకాల అమరికలకు ఎంపికలుఅభిరుచులు కలిగి ఉంది.

కొత్త విండోలు, ట్యాబులు
ఈ అమరికలు మీరు ముంగిలి పేజీ, ఒక కొత్త ఫైర్‌ఫాక్స్ విండో లేదా ఒక కొత్త ట్యాబ్ తెరచినప్పుడు ఏమి చూడాలో అనేది ఎంపిక చేసుకోనిస్తాయి. మీరు మీ ముంగిలి పేజీని అప్రమేయ ఫైర్‌ఫాక్స్ ముంగిలి పేజీ, ఒక ఖాళీ పేజీ లేదా ఒక ఎంచుకున్న URLకు అమర్చుకొనవచ్చు; కొత్త ట్యాబులు అప్రమేయ ఫైర్‌ఫాక్స్ ముంగిలి పేజీని లేదా ఒక ఖాళీ పేజీని తెరచునట్టు అమర్చుకోవచ్చు.

ఫైర్‌ఫాక్స్ ముంగిలి కంటెంట్
ఈ అమరికలు; వెబ్ శోధన, ఉత్తమ సైట్లు, పాకెట్‌చే సిఫారసు చేయబడినవి, మొజిల్లా స్నిప్పెట్స్ మరియు ప్రముఖ విషయాలతో సహా అప్రమేయ ఫైర్‌ఫాక్స్ ముంగిలి పేజీ లేదా కొత్త ట్యాబ్ పేజీ స్వరూపాలను దాచుట లేదా చూపించుటకు అనుమతిస్తాయి. ఈ లక్షణాల గురించి మరింత సమాచారం కోసం క్రొత్త ట్యాబ్లో టైల్స్ గురించి మరియు Customize your Firefox New Tab page చూడండి.

వెతుకుడు ప్యానెలు

ఈ ప్యానెలు ఫైర్‌ఫాక్స్ అప్రమేయంగా వాడే వెతుకుడు యంత్రం ఎంపికలుఅభిరుచులు మరియు ఇతర వెతుకుడు అమరికలను కలిగిఉంటుంది. మరింత సమాచారం కోసం Firefox లో మీ డిఫాల్ట్ శోధన సెట్టింగ్లను మార్చండి చూడండి.

అంతరంగికత & భద్రత ప్యానెలు

ఈ ప్యానెలులో ఈ క్రింది రకాల అమరికలకు ఎంపికలుఅభిరుచులు ఉంటాయి:

"విహారిణి గోప్యత"
ఫారంలు & పాస్‌వర్డులు, చరిత్ర, చిరునామా బార్, స్థానికంగా నిల్వచేసిన వెబ్ కంటెంట్, సైటు సమాచారంకుకీలు, సైటు సమాచారం, మరియు ట్రాకింగ్ భద్రత: ఇక్కడ మీరు ఫైర్‌ఫాక్స్ ఫారంలలో ఏమి నింపుతుందో అనేది నియంత్రణ మరియు పాస్‌వర్డులను నిర్వహించుట చేయవచ్చు. అంటే ఇది ఉపయోగించి మీరు ఫైర్‌ఫాక్స్ మీ విహరణ, దింపుకోలు, వెతుకుట, ఫార్మ్ చరిత్ర మరియు వెబ్‌సైటు కుకీలు అమర్చుకోవచ్చు; చిరునామా బార్ ఎలా పనిచేస్తుంది అనేది అమర్చుకోవచ్చు; ఫైర్‌ఫాక్స్ కాష్‌ని తొలగించడం చేయవచ్చు,వెబ్‌సైటు సమాచార నిల్వను నిర్వహించుట మరియు వెబ్‌సైటు కుకీలు చేయవచ్చు; ఫైర్‌ఫాక్స్ ట్రాకింగ్ భద్రత మరియు ట్రాక్ చేయవద్దు స్వరూపాల యొక్క అమరికలను నియంత్రించవచ్చు.

అనుమతులు
ఇక్కడ మీరు వెబ్సైట్లు మీకు వెబ్ పుష్ ప్రకటనలు పంపించవచ్చా, పాప్ అప్ విండోలు చూపించవచ్చా మరియు వెబ్సైట్లు పొడిగింపులు స్థాపించుకోవడం చేయొచ్చా అనేది నిర్ణయించుకోవచ్చు.

ఫైర్‌ఫాక్స్ డేటా సేకరణ, వాడుక
ఇక్కడ మీరు ఫైర్‌ఫాక్స్ మొజిల్లాకు సాంకేతిక మరియు పారస్పరిక సమాచారం పంపించు, స్టడీస్‌ని స్థాపించి నడుపు లేదా మొజిల్లాకు క్రాష్ నివేదికలు పంపడం అనేవి నిర్ణయించుకోవచ్చు.

భద్రత
వంచన నుండి రక్షణ, సర్టిఫికెట్లు, జతపరచని వెబ్ కంటెంట్ మరియు వాడుకరి సమాచారం: ఇక్కడ మీరు ఫైర్‌ఫాక్స్‌లో ప్రమాదకరమైన కంటెంట్ మరియు దింపుకోళ్ళను అడ్డుకోవడం, వెబ్సైటు సర్టిఫికెట్లను చూడడం మరియు నిర్వహించడం మరియు భద్రతా పరికరాలు, మరియు మీరు వెబ్సైటు సమాచార నిల్వని నిర్వహించడం అనేవి నిర్ణయించుకోవచ్చు. మోసపూరిత కంటెంట్ మరియు ప్రమాదకర సాఫ్ట్‌వేర్ రక్షణ మరియు సర్టిఫికెట్లు: ఇక్కడ మీరు వెబ్సైటు సర్టిఫికెట్లు మరియు భద్రతా పరికరాలు చూడడం మరియు నిర్వహించడం చేయవచ్చు మరియు మీరు ఫైర్‌ఫాక్స్‌లో ప్రమాదకర కంటెంట్ లేదా దింపుకోళ్లను అడ్డగించుట చేయవచ్చు.

ఫైర్‌ఫాక్స్ ఖాతా ప్యానెలు

ఈ ప్యానెలు మిమ్మల్ని ఒక ఫైర్‌ఫాక్స్ ఖాతాను అమర్చుకొనుట లేదా నిర్వహించడం చేయనిస్తుంది, ఇది సింక్ వంటి నిశ్చిత మొజిల్లా సేవలను వాడుకొనుటకు అవసరం. మరింత సమాచారం కోసం నేను నా కంప్యూటర్లో సింక్ ఎలా సెటప్ చేయాలి మరియు How do I choose what information to sync on Firefox? చూడండి.

జనరల్ ప్యానెలు

ఈ ప్యానెలు అతి సాధారణంగా వాడే అమరికలకు సంబంధించిన ఎంపికలుఅభిరుచులు కలిగిఉంటుంది. ఉదాహరణకు ఫైర్‌ఫాక్స్ ఆరంభమైనప్పుడు మొదట కనపడేవి మరియు దస్త్రాల దింపుకోళ్ళను ఫైర్‌ఫాక్స్ ఎక్కడ భద్రపరుస్తుంది వంటివి. మరింత సమాచారం కోసం ప్రారంభం, హోం పేజీ టాబ్ లు, మరియూ డౌన్లోడ్ సెట్టింగులు చూడండి.

వెతుకుడు ప్యానెలు

ఈ ప్యానెలు ఫైర్‌ఫాక్స్ అప్రమేయంగా వాడే వెతుకుడు యంత్రం ఎంపికలుఅభిరుచులు మరియు ఇతర వెతుకుడు అమరికలను కలిగిఉంటుంది. మరింత సమాచారం కోసం Firefox లో మీ డిఫాల్ట్ శోధన సెట్టింగ్లను మార్చండి చూడండి.

కంటెంట్ ప్యానెలు

ఈ ప్యానెల్ వెబ్సైట్లు ఎలా కనబడతాయో అనేదానికి సంబంధించిన ఎంపికలుఅభిరుచులు కలిగిఉంటుంది. మరింత సమాచారం కోసం వెబ్ కంటెంట్ , పాప్ అప్ లు, ఫాంట్లు మరియు భాషల కోసం సెట్టింగులు చూడండి.

అనువర్తనాల ప్యానెలు

ఈ ప్యానెలు ఫైర్‌ఫాక్స్ విభిన్న రకాల దస్త్రాలకు చేయూత ఎలా ఇస్తుందో అనేది నిర్ణయించుకోనిస్తుంది. ఇది మీకు ఒక కంటెంటు రకాల జాబితాను చూపించి, ప్రతి రకానికి క్రియను ఎంచుకోనిస్తుంది. ఉదాహరణకు ఒక అనువర్తనంతో దస్త్రాన్ని తెరచుట లేదా దస్త్రాన్ని భద్రపరచుట వంటివి. మరింత సమాచారం కోసం అప్లికేషన్స్ ప్యానెల్ -ఫైర్ఫాక్స్ వివిధ రకాల ఫైళ్లు ఎలా నిర్వహించాలో సెట్ చేయండి చూడండి.

గోప్యత ప్యానెలు

ఈ ప్యానెలు మీ గోప్యతకు సంబంధించిన ఎంపికలుఅభిరుచులు కలిగిఉంటుంది. మీరు జాల విహరణ చేసేప్పుడు, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారో, ఏయే పేజీలు చూశారో లాంటివి ఇక్కడ భద్రపరచబడతాయి. మరింత సమాచారం కోసం గోప్యతా, బ్రౌజింగ్ చరిత్ర మరియు ట్రాక్ చేయద్దు కోసం సెట్టింగులు చూడండి.

భద్రత ప్యానెలు

ఈ ప్యానెలు మీ జాల విహరణను సురక్షితంగా ఉంచడానికి సంబంధించిన ఎంపికలుఅభిరుచులు కలిగిఉంటుంది. మరింత సమాచారం కోసం భద్రత మరియు పాస్వర్డ్లను సెట్టింగులు చూడండి.

సింక్ ప్యానెలు

ఈ ప్యానెలు ఫైర్‌ఫాక్స్ సింక్ ఖాతాను అమర్చుకొనడం లేదా నిర్వహించడం చేయనిస్తుంది. ఫైర్‌ఫాక్స్ సింక్ అనేది మీ బుక్‌మార్కులు, చరిత్ర, పాస్‌వర్డులు, తెరచిన ట్యాబులను (వేరే కంప్యూటరు లేదా మొబైల్ ఫోనులో ఉన్న) ఇంకొక ఫైర్‌ఫాక్స్ ప్రతితో సింక్రొనైజ్ చేసే ఒక సేవ. మరింత సమాచారం కోసం నేను నా కంప్యూటర్లో సింక్ ఎలా సెటప్ చేయాలి మరియు How do I choose what information to sync on Firefox? చూడండి.

అడ్వాన్స్డ్ ప్యానెలు

ఈ ప్యానెలు ఎక్కువగా వాడని అమరికలకు ఎంపికలుఅభిరుచులు కలిగిఉంటుంది. ఉదాహరణకు డిస్క్ కాష్ శుభ్రపరచుట, సర్టిఫికెట్ అమరికలు, ప్రాక్సీ అమరికలు, ఫైర్‌ఫాక్స్ నవీకరణ అమరికలు, కొంతమంది ప్రత్యేక ప్రజలకు మాత్రమే అవసరమయ్యే వివిధ అడ్వాన్స్డ్ అమరికలు వంటివి. మరింత సమాచారం కోసం అధునాతన ప్యానెల్- యాక్సెసిబిలిటీ, బ్రౌజింగ్, నెట్వర్క్, నవీకరణలను మరియు ఫైర్ ఫాక్సు లో ఇతర అధునాతన సెట్టింగులు చూడండి.