ఫైర్ఫాక్స్ DRM కంటెంట్ ను చూడండి

డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ (DRM) అనేది ఆన్లైన్ వీడియో మరియు ఆడియో సేవలు ప్రారంభించి, అవి అందించే కంటెంట్ వారి అవసరాలకు అనుగుణంగా అమలు చేయడానికి ఉపయోగిస్తున్న సాంకేతికత. ఈ సాంకేతికత మీరు బ్రౌజర్ లో చేయు కొన్ని విషయాలను పరిమితం చేస్తుంది. కొన్ని రకాల DRM-నియంత్రిత కంటెంటును మైక్రోసాఫ్ట్ సిల్వర్‌లైట్ మరియు అడోబ్ ఫ్లాష్ ప్లగిన్లను ఉపయోగించి చూడవచ్చు అయితే, అనేక సేవలు కంటెంట్ వ్యక్తపర్చడం మాడ్యూల్ (CDM) అని పిలిచే ఒక విభిన్న DRM విధానం అవసరమయ్యే HTML5 వీడియో వైపు తరలిస్తున్నారు.

DRM-నియంత్రిత కంటెంటును ఫైర్‌ఫాక్స్‌లో చూడడం

డెస్క్‌టాప్ కొరకు ఫైర్‌ఫాక్స్ DRM-నియంత్రిత కంటెంటును చూపించడానికి గూగుల్ వైడ్‌వైన్ CDMకు మద్దతునిస్తుంది.వాడుకరులకు DRM అవసరమయ్యే సైట్లలో ఒక మృదువైన అనుభవాన్ని ఇవ్వడానికి ఫైర్‌ఫాక్స్ గూగుల్ వైడ్‌వైన్ CDMను దింపుకుని, ఎనేబుల్ చేస్తుంది.వాడుకరులకు DRM అవసరమయ్యే సైట్లలో ఒక మృదువైన అనుభవాన్ని ఇవ్వడానికి ఫైర్‌ఫాక్స్ గూగుల్ వైడ్‌వైన్ CDMను అడిగినప్పుడు, వాడుకరి అనుమతితో దింపుకుని, ఎనేబుల్ చేస్తుంది. ఈ CDM శాండ్‌బాక్స్ అనే వేరే కంటైనర్లో పనిచేస్తుంది, అది వాడుకలో ఉన్నప్పుడు మీకు తెలియపరుస్తుంది. మీరు కూడా CDMని నిలిపివేయవచ్చు మరియు ఈ క్రింది దశలను అనుసరించడం ద్వారా భవిష్య నవీకరణలను నిలిపివేయవచ్చు. ఒకసారి మీరు CDMను ఆపివేస్తే ఈ రకం DRM వాడే సైటులు సరిగా పనిచేయకపోవచ్చు.

అన్ఇన్స్టాల్ చేయకుండా గూగుల్ వైడ్‌వైన్ CDM ఆపివేయుట

యాడ్ ఆన్స్ నిర్వాహకి నుండి గూగుల్ వైడ్‌వైన్‌ను అచేతనం చేస్తే అది మీ కంప్యూటర్లో పనిచేయకుండా నిరోధిస్తుంది, భవిష్య నవీకరణలను దింపుకోలు చేసుకోనీయకుండా నిరోధిస్తుంది. ఈ CDM ప్లగిన్‌ను అచేతనం చేయడానికి:

  1. ఫైర్ఫాక్సు విండో ఎగువన, బటన్ ఫైర్ఫాక్సు నొక్కండి మెనూ బార్ లో, మెనూ ని టూల్స్ నొక్కండి ఫైర్ఫాక్సు విండో ఎగువన, మెనూ ని టూల్స్ నొక్కండి , మరియు ఆ తరువాత నొక్కండి ఆడ్-ఆన్స్. ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది. మెనూ బటన్ నొక్కండి New Fx Menu మరియు ఎంచుకోండి ఆడ్-ఆన్స్. ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది.

  2. ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ లో, ఎంచుకోండి Plugins పెనెల్.
  3. గూగుల్ ఇంక్ వారి వైడ్‌వైన్ కంటెంట్ వ్యక్తపర్చడం మాడ్యూల్కి పక్కన ఉన్న మెనూలో Never Activateని ఎంచుకోండి.

గూగుల్ వైడ్‌వైన్‌ని చేతనం చేయకుండా కంటెంట్ ప్లేబ్యాక్ సాధ్యపడని సైట్లు మీకు తారసపడవచ్చు. మీరు ఎల్లప్పుడూ గూగుల్ వైడ్‌వైన్‌ని చేతనం చేయడానికి "గూగుల్ ఇంక్ వారి వైడ్‌వైన్ కంటెంట్ వ్యక్తపరచడం మాడ్యూలు" పక్కన ఉన్న Always Activate మెనూని ఎంచుకోవచ్చు.

CDM ప్లేబ్యాక్ నిలిపివేయడానికి, CDMA అన్ఇన్స్టాల్ మరియు అన్ని CDM డౌన్లోడ్లను ఆపడానికి

మీరు HTML5 DRM ప్లేబ్యాక్ నిలిపివేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసే అవకాశముంది. మీరు నిలిపివేసిన తర్వాత, ఫైర్ఫాక్స్ మీ హార్డు డ్రైవు నుండి ఏదైనా డౌన్లోడ్ చేసున్న CDMలను తొలగిస్తుంది, అన్ని భవిష్యత్ CDM డౌన్లోడ్లు మరియు DRM ప్లేబ్యాక్ డిసేబుల్ చేస్తుంది. ఇది కేవలం DRM నియంత్రిత HTML5 ఆడియో మరియు వీడియోలను ప్రభావితం చేస్తుంది. పూర్తిగా HTML5 DRM ప్లేబాక్ నిలిపివేయడానికి, ఈ దశలను అనుసరించండి:

  1. మెనూ బొత్తం New Fx Menu Fx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.
  2. General ప్యానెల్లో "Digital Rights Management (DRM) Content" విభాగానికి వెళ్లండి.
  3. "Play DRM-controlled content" పక్కన ఉన్న చెక్‌మార్కును తీసివేయండి.
గమనిక: అవి ఫైర్‌ఫాక్స్‌లో స్థాపించబడి, చేతనం చేయబడినయెడల, మీరు ఇప్పటికీ అడోబె ఫ్లాష్ ప్లగిన్ అవసరమయ్యే DRM కంటెంటును చూడగలుగుతారు. "Play DRM-controlled content" అమరిక HTML 5 DRM ప్లేబాక్‌ని మాత్రమే నియంత్రిస్తుంది, కానీ ప్లగిన్లను కాదు.

DRMని చేతనం చేయకుండా కంటెంట్ ప్లేబాక్ సాధ్యపడని సైట్లు మీకు తారసపడవచ్చు. మీరు ఎల్లప్పుడూ DRM ప్లేబాక్‌ని చేతనం చేయడానికి ఎంపికలుప్రాధాన్యతలు General ప్యానెల్ మరియు "Digital Rights Management (DRM) Content" కింద Play DRM-controlled content ప్రక్కన ఉన్న చెక్‌మార్క్‌ని ఎంచుకోండి. చెక్‌బాక్సుని ఎంచుకున్న తరువాత HTML5 DRM ప్లేబాక్ తిరిగి చేతనమవుతుంది మరియు గూగుల్ వైడ్‌వైన్ CDM స్వయంచాలకంగా దించుకోబడుతుంది.

మద్దతు వేదికలు

గూగుల్ వైడ్‌వైన్

  • విండోస్ విస్తా ఆపైన
  • మాక్ ఓఎస్ ఎక్స్ 10.9 ఆపైన
  • x86, x64 లీనక్స్

ఇలాంటి నిలిపివేత సామర్థ్యాలు ఫైర్‌ఫాక్స్ DRMకు మద్దతునిచ్చే అన్ని కొత్త వేదికలపై అందించబడుతాయి.

// These fine people helped write this article:Dinesh, చిలాబు. You can help too - find out how.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

మొజిల్లా తోడ్పాటులో స్వచ్ఛందంగా తోడ్పడండి