ఫైరుఫాక్సు కాష్ ను క్లియర్ చేయడం ఎలా

ఫైర్ఫాక్స్ కాష్ మీ బ్రౌజింగ్ అనుభవాన్ని వేగవంతం చేయడానికి చిత్రాలు, స్క్రిప్ట్, మరియు మీరు సందర్శించిన వెబ్సైట్లలోని ప్రాంతాలను తాత్కాలికంగా నిల్వ చేస్తుంది. ఈ వ్యాసం కాకాష్‌ను తొలగించడం ఎలా అని వివరిస్తుంది.

కాష్‌ని తొలగించుట

 1. మెనూ బొత్తం New Fx Menu Fx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.
 2. Advanced పానెల్ ఎంచుకోండి.
 3. నెట్వర్క్ టాబ్ పై నొక్కండి.
 4. కాష్డ్ వెబ్ కంటెంట్ విభాగంలో, Clear Nowని నొక్కండి.
  clear cache incontent
 5. "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.
 1. మెనూ బొత్తం New Fx Menu Fx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.
 2. Privacy & Security ప్యానెల్ ఎంచుకోండి.
 3. కాష్డ్ వెబ్ కంటెంట్ విభాగంలో Clear Now నొక్కండి.
  Fx56CachedWebContent-clear Fx59CachedWebContent-ClearNow
 4. "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.
 1. మెనూ బొత్తం New Fx Menu Fx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.
 2. Privacy & Security ప్యానెల్ ఎంచుకోండి.
 3. కుకీలు మరియు సైటు డాటా విభాగంలో Clear Data...ని నొక్కండి.
  Fx60Cookies&SiteData-ClearCache
 4. "కుకీలు మరియ్ సైటు డాటా" ముందు ఉన్న ఎంపికను తొలగించండి.
 5. "కాష్డ్ వెబ్ కాంటెంట్" ఎంపిక చేసిఉన్నపుడు, Clear బొత్తాన్ని నొక్కండి.
 6. "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.

స్వయంచాలకంగా కాష్ క్లియర్ చేయుట

ఫైర్ఫాక్సు మూసివేయబడినప్పుడు స్వయంచాలకంగా కాష్ తొలగించబడేట్టు ఫైర్ఫాక్సును అమర్చుకొనవచ్చు :

 1. మెనూ బొత్తం New Fx Menu Fx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.
 2. PrivacyPrivacy & Security ప్యానెల్ ఎంచుకోండి .
 3. చరిత్ర విభాగంలో, ఫైర్‌ఫాక్స్ విల్ని Use custom settings for historyగా అమర్చండి.
 4. ఫైర్ఫాక్స్ మూసివేయబడినప్పుడు చరిత్రను చెరిపివేయి చెక్ బాక్స్ ఎంచుకోండి.
  clearhistorywhenFXclosesfx42 Fx56History-custom-clear
 5. "ఫైర్ఫాక్స్ మూసివేయబడినప్పుడు చరిత్రను చెరిపివేయి" పక్కన ఉన్న Settings... బొత్తాన్ని నొక్కండి. చరిత్రను చెరిపివేసే అమరికలు ఉన్న విండో తెరచుకుంటుంది.
 6. చరిత్రను చెరిపివేసే అమరికలు ఉన్న విండోలో కాష్ పక్కన ఉన్న చెక్ బాక్స్‌ను ఎంచుకోండి.
  SettingsForClearingHistoryFX42bd
 7. చరిత్రను చెరిపివేయు అమరికల విండోను మూసివేయడానికి OKని నొక్కండి.
 8. "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.

చిట్కా: మీ టూల్బార్ పై ఒక చిహ్నాన్ని ఉపయోగించి కాష్‌ను తొలగించుటకు అనుమతించే అనేక పొడగింతలు అందుబాటులో ఉన్నాయి. వెతకడానికి మొజిల్లా యాడ్ ఆన్స్ వెబ్ పేజీకి వెళ్ళండి.

మొజిల్లా కమ్యూనిటీ బయటివారి పొడగింతలను నిర్వహించదు, మద్దతునివ్వదు. మీకు ఏదేని పొడగింత గురించి సహాయం కావాలంటే దయచేసి నేరుగా దాని డెవలపర్‌ని సంప్రదించండి.
// These fine people helped write this article:JAYANTH , Dinesh, చిలాబు. You can help too - find out how.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

మొజిల్లా తోడ్పాటులో స్వచ్ఛందంగా తోడ్పడండి