కుకీలు - వెబ్ సైట్లు మీ కంప్యూటర్లో నిల్వ ఉంచే సమాచారం

రివిజన్ సమాచారం
  • రివిజన్ id: 165053
  • సృష్టించబడింది:
  • సృష్టికర్త: చిలాబు
  • వ్యాఖ్య: Corrections done. Last 3 paras to review closely.
  • పరిశీలించినవి: కాదు
  • స్థానికీకరణ కోసం సిద్ధంగా ఉన్నది: కాదు
రివిజన్ మూలం
రివిజన్ కంటెంట్

ఈ వ్యాసం "కుకీలు" అంటే ఏమిటో, వాటిని ఎలా ఉపయోగిస్తారో, మరియు ఫైర్‌ఫాక్స్‌లో వాటిని ఎలా నిర్వహించాలో వివరిస్తుంది.

కుకీ అంటే ఏమిటి?

కుకీ అనేది మీరు సందర్శించే వెబ్సైట్ మీ కంప్యూటర్లో నిల్వ చేసే సమాచారం.

కొన్ని బ్రౌజర్లలో ప్రతి కుకీ ఒక చిన్న ఫైల్ కానీ ఫైర్‌ఫాక్స్‌లో అన్ని కుకీలు ఫైర్ఫాక్స్ ఫోల్డర్ లోని ప్రొఫైల్ అను ఒకటే ఫైల్ లో నిల్వచేయబడతాయి.

కుకీలు తరచుగా మీరు ఒక వెబ్సైటు యొక్క ప్రాధాన్యతా భాష లేదా ప్రదేశము వంటి మీరు వాడే అమరికలను నిల్వ చేస్తాయి. దీనివలన ఆ వెబ్సైటు మీ అవసరాలకై అనుకూలీకరించిన సమాచారాన్ని మీకు చూపిస్తుంది.

కుకీలు వ్యక్తిగత గుర్తింపు సమాచారం (మీ పేరు, ఇంటి చిరునామా, ఇ-మెయిల్ చిరునామా, లేదా టెలిఫోను సంఖ్య వంటివి) తో సహా పలు రకాల సమాచారాన్ని నిల్వ చేయగలవు. అయితే, ఈ సమాచారం మీరు ఇచ్చిన తదుపరే నిల్వ చేయబడుతుంది - మీరు ఇవ్వని సమాచారాన్ని వెబ్సైట్లు పొందలేవు మరియు అవి మీ కంప్యూటర్లోని దస్త్రాలను వాడుకోలేవు.

కుకీలను నిల్వ ఉంచడం మరియు పంపడం అన్న కార్యకలాపాలు అప్రమేయంగా మీకు కనపడవు. కానీ, మీరు ఆమోదించడాం లేదా కుకీలను నిల్వ చేసే అభ్యర్థనలను త్రోసిపుచ్చడం, ఫైర్‌ఫాక్స్‌ను మూసివేసినప్పుడు నిల్వ ఉంచిన కుకీలను స్వయంచాలకంగా తొలగించడం ఇంకా ఇలాంటివి చేయడానికి మీరు ఫైర్‌ఫాక్స్ అప్రమేయాలను మార్చవచ్చు.

కుకీ అప్రమేయాలు

ఫైర్‌ఫాక్స్ లో కుకీ అప్రమేయాలు ఎంపికలుప్రాధాన్యతలు ద్వారా నిర్వహించబడతాయి. ఈ అప్రమేయాలు మార్చుటకై:

  1. మెనూ బొత్తం New Fx MenuFx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.

విండోస్ ప్రైవసి పానల్ లో నిర్వహించబడతాయి. ఈ సెట్టింగుల సమాచారం కోసం ప్రైవసీ, బ్రౌజింగ్ చరిత్ర మరియు ట్రాక్ చేయకూడదు సెట్టింగులు కోసం చూడండి.

కొన్ని లక్ష్యాలకు ఈ సెట్టింగ్లను ఎలా ఉపయోగించాలో సూచనలను కోసం, చూడండి:

మీ కంప్యూటర్లో వెబ్సైట్లు నిల్వ చేసిన సమాచారం తొలగించడానికి కుకీలను తొలగించు: ఇప్పటికే వెబ్సైట్ల ద్వారా నిల్వ చేసిన కుకీలను ఎలా తొలగించాలి.

కుకీలను ట్రబుల్షూటింగ్

మీ ఫైర్ ఫాక్సులో కుకీలకు సంబందించి ఒక సమస్య ఎదురైతే, చూడండి