పేజీ సమాచారం విండో - మీరు ఉన్నపేజీ సాంకేతిక వివరాలు గురించి చూడండి

ఫైర్‌ఫాక్స్ "పేజీ సమాచారం" విండో మీరు ఉన్న పేజీ గురించి సాంకేతిక వివరాలను ఇస్తుంది మరియు వెబ్సైటుయొక్క వివిధ అనుమతులను మార్చనిస్తుంది. పేజీ సమాచారం విండోని తెరవడానికి: వెబ్ పేజీలోని ఖాళీ ప్రదేశంలో కుడి క్లిక్అది నొక్కే ముందు Ctrl నొక్కి ఉంచండి మరియు సందర్భానుసార పట్టికనుండి View Page Infoను ఎంచుకోండి. మీరు పేజీ సమాచారం విండోని ఈ క్రింది క్రమం ద్వారా కూడా తెరవవచ్చు:

 1. ఒక వెబ్ పేజీ యొక్క చిరునామాకు ఎడమ వైపున్న Site Info button బటన్ పై నొక్కి నియంత్రణ కేంద్రంని తెరవండి.
 2. డ్రాప్ డౌన్ ప్యానెల్ కు కుడి వైపున ఉన్న బాణపు గుర్తుపై నొక్కండి.
  Fx52ControlCenter Fx60ControlCenter
 3. తదుపరి ప్రాంప్టులో More Information బటన్ను నొక్కండి.
  Fx52ControlCenter-MoreInfo Fx60ControlCenter-MoreInfo

పేజీ సమాచారం విండో వివిధ ప్యానెళ్ళుగా పొందుపరచబడింది. ప్రతి ప్యానెల్ ఈ క్రింద వివరించబడింది.

విషయాల పట్టిక

జనరల్

Fx61PageInfo-General Fx64PageInfo-General
జనరల్ పానెల్ లో పేజీ శీర్షిక, కంటెంట్ రకం మరియు పరిమాణం వంటి పేజీ గురించి ప్రాథమిక సమాచారం, అలాగే మూలము నుండి మరింత సాంకేతిక సమాచారం ఉన్నాయి.

 • పేజీ శీర్షిక: మీరు సందర్శిస్తున్న పేజీ శీర్షికను ప్రదర్శిస్తుంది.
 • చిరునామా: మీరు సందర్శిస్తున్న పేజీ యొక్క URL ( యూనిఫాం రిసోర్స్ లొకేటర్)ను ప్రదర్శిస్తుంది.
 • రకం: మీరు సందర్శిస్తున్న పేజీ యొక్క కంటెంట్ రకం ( MIME రకం) ప్రదర్శిస్తుంది. ఈ రకాన్ని వెబ్ సర్వర్ ద్వారా గుర్తిస్తారు.
 • చూపించు పద్ధతి : పేజీ వెబ్ కోడింగ్ ప్రమాణాలు (ప్రమాణాలు పాటిస్తున్న రీతి) పాఠిస్తుందో లేదో చూపిస్తుంది లేదా ఫైర్‌ఫాక్స్ ప్రామాణికం కాని కోడ్ (అసాధారణ రీతి) అనుకూలంగా ఉండే విధంగా పేజీని ప్రదర్శించాలేమో చూపిస్తుంది.
 • అక్షర సంకేతనం: పేజీ ఏ అక్షర సంకేతనాన్ని వాడుతుందో చూపిస్తుంది. ఇది View మెను ద్వారా మార్చవచ్చు.
 • పరిమాణం: పేజీ యొక్క పరిమాణాన్ని కిలోబైట్లు (మరియు బైట్లలో) చూపిస్తుంది.
 • సవరణ: పేజీని ఈమధ్య మార్చిన తేదీ మరియు సమయం చూపిస్తుంది.

మెటా

మెటా ఫీల్డ్ పేజీ సోర్స్ కోడ్‌లో ఉన్న ఏవైనా metatagsని చూపిస్తుంది. ఇవి ఫైలు రకం, అక్షర సంకేతనం, రచయిత, కీలకపదాలు, మరిన్ని ఇలాంటివి.

మీడియా

Fx61PageInfo-Media Fx64PageInfo-Media
మీడియా ప్యానెల్ పేజీతో పాటు లోడ్ అయిన URL, అన్ని రకాల నేపథ్యాలు, చిత్రాలు, మరియు (ఆడియో మరియు వీడియోతో సహా) ఎంబెడెడ్ కంటెంట్ ని ప్రదర్శిస్తుంది. మీరు ఏదేని అంశంపై నొక్కి దానిగ ురించి ఈ దిగువ చూపించిన వంటి వివరాలు తెలుసుకోవచ్చు:

 • స్థానము: పేర్కొన్న అంశము యొక్క URL.
 • రకం: పేర్కొన్న అంశపు దస్త్రం యొక్క రకం.
 • పరిమాణం: పేర్కొన్న అంశం పరిమాణం, కిలోబైట్లు (మరియు బైట్లలో).
 • 'కొలతలూ: తెరపై అంశం యొక్క పరిమాణం, పిక్సెళ్ళలో.
 • సంబంధించిన పాఠ్యము: చిత్రాలకు, చిత్రం లోడ్ కాకపోతే ప్రదర్శించే "ప్రత్యామ్నాయ" పాఠ్యము.

ఏ అంశానికైనా, మీరు Save As... బటన్ని నొక్కడం ద్వారా మీ హార్డ్ డ్రైవ్‌లో దాన్ని భద్రపరచుకోవచ్చు.

డొమైన్ నుండి చిత్రాలను అడ్డగించుట

ఎంపికప్రాధాన్యతను ఎంచుకుంటే స్వయంచాలకంగా చిత్రాలను లోడ్ చేయకుండా పేర్కొన్న డొమైన్ యొక్క పేజీలను నిరోధిస్తుంది.

ఫీడ్లు

Fx61PageInfo-Feeds

ఫీడ్ల ప్యానెల్ URLని, పేజీకి సంబంధించిన ఏదేని వెబ్ ఫీడ్ల రకాన్ని చూపిస్తుంది. ఒక ఫీడ్‌కి చందాదారులవడానికి జాబితాలోని దాని లంకెపై నొక్కండి. మరింత సమాచారం కోసం Live Bookmarks - Subscribe to a web page for news and updates చూడండి.
గమనిక: పేజీకి వెబ్ ఫీడ్లు లేకపోతే పేజీ సమాచార విండో ఫీడ్ల ప్యానెల్‌ని కలిగియుండదు.

అనుమతులు

Fx52PageInfo-Permissions Fx55PageInfoPermissions Fx57PageInfoPermissions Fx58PageInfo-Permissions Fx61PageInfo-Permissions Fx63PageInfo-Permissions Fx64PageInfo-Permissions
అనుమతులు Permissions for తరువాత చూపించిన డొమెయిన్ ప్యానెల్ ఎంపికలుఅభిరుచులు నిరాకరించుటకు అనుమతిస్తుంది. పేజీ సూచించబడిన చర్యను చేయడానికి అనుమతి ఉందో లేదో తెలుపుటకు Use Default డబ్బాపై టిక్కును తీసివేయండి.

ప్లగిన్లు సక్రియం చేయుట

మార్చి 7, 2017న విడుదలైన ఫైర్‌ఫాక్స్ వెర్షను 52లో, ఫ్లాష్ తప్ప మిగతా అన్ని NPAPI చొప్పింతలకు తోడ్పాటు ముగిసింది. వివరాలకు ఈ అనుగుణ్యతా పత్రాన్ని, ఈ వ్యాసాన్నీ చూడండి.

ఫైర్‌ఫాక్స్ వెర్షను 52తో మొదలుకొని, అడోబి ఫ్లాష్ తప్ప మిగతా అన్ని NPAPI ప్లగిన్లకు తోడ్పాటు ముగిసింది. వివరాలకు ఈ అనుగుణ్యతా పత్రాన్ని, ఈ వ్యాసాన్నీ చూడండి.

స్థాపించబడిన ప్లగిన్ల జాబితాను చూపిస్తుంది మరియు ప్రతి ప్లగిన్ లోడు అయ్యేప్పుడు డొమెయిన్ ఎప్పుడూ అడుగు, అనుమతించు, లేదా అడ్డగించు అనేది నిర్దేశిస్తుంది. ప్లగిన్లను నొక్కుతో చేతనం ఎందుకు చేసుకోవాలి? అనే వ్యాసం ఈ అనుమతులను నిర్దిష్ట సైట్లకు ఎలా ఉంచాలో విశదీకరిస్తుంది.

మీ స్థాన ప్రాప్యత

ఫైర్‌ఫాక్స్ పేర్కొన్న డొమైన్‌కి మీరు ఎక్కడ ఉన్నారో స్థానం తెలిసిన బ్రౌసింగ్ని ఉపయోగించి చెప్పడాన్ని అనుమతించడాన్ని నిర్దేశిస్తుంది.

అప్రమేయంగా మీడియాను ధ్వనితో ప్లే చేయి

పేర్కొన్న డొమెయిన్ మీడియాను ఆటోప్లే చేయడానికి అనుమతి ఉందా అనేది నిర్దేశిస్తుంది. మరింత సమాచారం కోసం Allow or block media autoplay in Firefox చూడండి. మీ ఫైర్‌ఫాక్స్ వెర్షనులో మీడియాను ఆటోప్లే చేయుట అను లక్షణము ఇంకనూ ఎనేబుల్ చేసి ఉండకపోవచ్చు.

Add-ons స్థాపించుట

పేర్కొన్న డొమెయిన్ పొడిగింపును లేదా థీమ్ సంస్థాపన డయలాగ్ బాక్స్‌ను ప్రారంభించడానికి అనుమతి ఉందా అనేది నిర్దేశిస్తుంది. సైట్లను సంస్థాపన అనుమతులు జోడించడానికి లేదా తొలగించడానికి భద్రత మరియు పాస్వర్డ్లను సెట్టింగులు వ్యాసం చూడండి. వెబ్సైట్ల స్థాపన అనుమతి జోడించడానికి లేదా తొలగించడానికి "అనుమతులు" క్రింద ఉన్న ఫైర్‌ఫాక్స్ ఎంపికలుఫైర్‌ఫాక్స్ అభిరుచులులోని గోప్యత & భద్రత ప్యానెల్ ఉపయోగపడుతుంది.

చిత్రాలను లోడ్ చేయి

పేర్కొన్న డొమెయిన్ చిత్రాలను స్వయంచాలకంగా లోడ్ చేయడాన్ని నిర్దేశిస్తుంది.

నేరుగా జతపరచని నిల్వను నిర్వహించు

పేర్కొన్న డొమెయిన్ జతచేయని కంటెంట్ నిల్వ చేయడం అనుమతించడాన్ని నిర్దేశిస్తుంది.

పాప్ అప్ విండోలను తెరువు

పేర్కొన్న డొమెయిన్ పాప్-అప్‌లను ఆరంభించవచ్చా అనేది నిర్దేశిస్తుంది. సైట్లను పాప్-అప్ అనుమతులు జోడించడం లేదా తొలగించడం ఎలా అనే దానిపై సూచనల కోసం పాప్ అప్ బ్లాకర్ సెట్టింగులు, మినహాయింపులు మరియు ట్రబుల్షూటింగ్ చూడండి.

కీబోర్డ్ షార్ట్‌కట్లను ఓవర్‌రైడ్ చేయి

పేర్కొన్న డొమెయిన్ బిల్టిన్ కీబోర్డ్ షార్ట్‌కట్లను భర్తీ చేయగలదా అన్నది నిర్దేశిస్తుంది; ఉదాహరణకు, Ctrl + Bcommand + Bని బుక్‌మార్క్స్ సైడ్‌బార్‌కి కాకుండా బోల్డ్ కమాండ్‌కు ముడిపెట్టడం. హెచ్చరిక: ఈ అనుమతిని "అడ్డగించు"కి సెట్ చేస్తే Delete కీ పనిచేయడం మానివేస్తుంది మరియు Backspace కీ బాక్ బటన్లా పని చేస్తుంది (ఫార్ములు, ఎడిటర్లలో కూడా).

ప్రకటనలు స్వీకరించు

పేర్కొన్న డొమైన్ వెబ్ పుష్ ప్రకటనలను స్వీకరించడానికి అనుమతిని నిర్దేశిస్తుంది.

అడోబె ఫ్లాష్‌ని పనిచేయించు

ఫ్లాష్ ప్లగిన్ లోడు అయ్యేప్పుడు డొమెయిన్ ఎప్పుడూ అడుగు, అనుమతించు, లేదా అడ్డగించు అనేది నిర్దేశిస్తుంది. ప్లగిన్లను నొక్కుతో చేతనం ఎందుకు చేసుకోవాలి? అనే వ్యాసం ఈ అనుమతులను నిర్దిష్ట సైట్లకు ఎలా ఉంచాలో విశదీకరిస్తుంది.

ప్రకటనలను పంపు

పేర్కొన్న డొమైన్ వెబ్ పుష్ ప్రకటనలను పంపడానికి అనుమతిని నిర్దేశిస్తుంది.

కుకీలను సెట్ చేయి

పేర్కొన్న డొమెయిన్ కుకీలు సెట్ చేయడాన్ని నిర్దేశిస్తుంది. సైట్లకు కుకీ అనుమతులు జోడించడం లేదా తొలగించడం ఎలా అనే దానిపై సూచనల కోసం మీ అభిరుచుల జాడతెలుసుకోడానికి వెబ్‌సైట్లు ఉపయోగించే కుకీలను చేతనం, అచేతనం చెయ్యడం చూడండి.

తెరను పంచుకో

వెబ్సైట్లు మీ కంప్యూటర్ తెరను పంచుకోవడానికి మీ అనుమతిని అడగవచ్చు. మీరు దీనిని "ఎప్పుడూ అడుగు" లేదా "అడ్డగించు"గా సెట్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం Share browser windows or your screen with sites you trustని చూడండి.

సమాచారాన్ని శాశ్వత నిల్వలో భద్రపరచు

పేర్కొన్న డొమెయిన్, తరువాత వాడుకోవడానికి వీలుగా మీ కంప్యూటర్‌లో సమాచారాన్ని నిల్వ చేసుకోవడం అనుమతించడాన్ని నిర్దేశిస్తుంది. ఫైర్‌ఫాక్స్ శాశ్వత నిల్వలో భద్రపరచిన వెబ్సైట్ల సమాచారాన్ని మీరు తొలగించేవరకు ఉంచుతుంది. మరింత సమాచారం కొరకు స్థానిక సైట్ నిల్వ సెట్టింగ్లను నిర్వహించండిని చూడండి.

ఈ టాబ్‌కు మారు

పేర్కొన్న డొమెయిన్ తన స్వంత టాబ్‌కు మారడం అనుమతించడాన్ని నిర్దేశిస్తుంది. మీరు దీనిని ఎప్పుడూ అడుగు లేదా అనుమతించుగా సెట్ చేసుకోవచ్చు.

కెమెరా ఉపయోగించు

పేర్కొన్న డొమెయిన్ మీ కెమేరాను ఉపయోగించడం అనుమతించడాన్ని నిర్దేశిస్తుంది. ఇది వీడియో ఛాట్ సైట్ల వంటి వీడియో లేదా చిత్ర సంగ్రహ సామర్థ్య సైట్లకు వర్తిస్తుంది. మీరు దీనిని ఎప్పుడూ అడుగు, అనుమతించు, లేదా అడ్డగించుగా సెట్ చేసుకోవచ్చు.

మైక్రోఫోన్ ఉపయోగించు

పేర్కొన్న డొమెయిన్ మీ మక్రోఫొనును ఉపయోగించే అనుమతిని నిర్దేశిస్తుంది. ఇది ధ్వని కాంఫరెన్సింగ్ సైట్ల వంటి ఆడియో రెకార్డింగ్ సామర్థ్యాలు ఉన్న సైట్లకు వర్తిస్తుంది. మీరు దీనిని ఎప్పుడూ అడుగు, అనుమతించు లేదా అడ్డగించుగా సెట్ చేసుకోవచ్చు.

భద్రత

Fx60PageInfo-Security-Secure Fx61PageInfo-Security-Secure Fx64PageInfo-Security

వెబ్సైట్ గుర్తింపు

 • వెబ్సైట్: పేజీ యొక్క డొమెయిన్‌ను చూపిస్తుంది.
 • యజమాని: పేజీ యొక్క గుర్తింపుని నిర్ధారించలేకపోతే సైటు యొక్క యజమానిని చూపిస్తుంది.
 • చే నిర్థారించబడింది: ఒక వేళ భద్రతా సర్టిఫికెట్ ఉంటే, అది జారీ చేసిన ఏజెన్సీని చూపిస్తుంది. సర్టిఫికెట్ చూడు బటన్‌ని నొక్కడం ద్వారా ఈ సర్టిఫికెట్‌ను చూడవచ్చు.

గోప్యత & చరిత్ర

 • నేను ఈరోజు కన్నా ముందు ఈ వెబ్సైటును సందర్శించానా?: మీరు ఈ రోజు కన్నా ముందు సైటును సందర్శించారా, ఒకవేళ సందర్శిస్తే, ఎన్ని సార్లు అనేది చూపిస్తుంది.
 • ఈ వెబ్సైట్ నా కంప్యూటర్లో సమాచారాన్ని (కుకీలు) నిల్వ చేస్తుందా?: సైటు కుకీలు నిల్వ చేస్తుందో లేదో చూపిస్తుంది. చూడండి కుకీలు బటన్‌ని నొక్కడం ద్వారా కుకీలను చూడవచ్చు లేదా ఒక వేళ నిల్వ చేసి ఉంటే తొలగించవచ్చు.

 • ఈ వెబ్సైట్ నా కంప్యూటర్లో సమాచారాన్ని నిల్వ చేస్తుందా?: సైటు కుకీలు లేదా వేరే సైటు సమాచారం నిల్వ చేస్తుందో లేదో చూపిస్తుంది. కుకీలు మరియు సైటు సమాచారం తొలగించు బటన్‌ని నొక్కడం ద్వారా సైటు సమాచారాన్ని చూడవచ్చు లేదా ఒకవేళ నిల్వ చేసి ఉంటే తొలగించవచ్చు.
 • నేను ఈ వెబ్సైట్ కోసం ఏదేని పాస్వర్డ్లను భద్రపరిచానా?: మీరు ఈ సైట్ లాగిన్ సమాచారం భద్రపరిచారో లేదో చూపిస్తుంది. భద్రపరచిన పాస్వర్డులను చూడు బటను నొక్కడం ద్వారా మీరు భద్రపరచిన సైటు పాస్వర్డులను చూడవచ్చు.

సాంకేతిక వివరాలు

సాంకేతిక వివరాలు విభాగం కనెక్షన్ గోప్యతా కారణాలచే గుప్తీకరించబడిందో లేదో, ఒక వేళ గుప్తీకరించబడితే ఏ రకం లేదా ఎంత బలమైన గుప్తీకరణను ఉపయోగించారో చూపిస్తుంది.


ఈ వ్యాసాన్ని పంచుకోండి: https://mzl.la/2LfrxcY

// These fine people helped write this article:Dinesh, చిలాబు. You can help too - find out how.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

మొజిల్లా తోడ్పాటులో స్వచ్ఛందంగా తోడ్పడండి