మీరు ఏ ఫైర్‌ఫాక్సు రూపాంతరం వాడుతున్నారో తెలుసుకోండి

ఒక సమస్యను పరిష్కరించడానికి గానీ లేదా ఫైర్‌ఫాక్సు తాజాపరచబడినదా అనేవి తెలుసుకోవడానికి మీరు ఏ ఫైర్‌ఫాక్సు రూపాంతరాన్ని వాడుతున్నారో తెలుసుకోవడం ముఖ్యం. తెలుసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి.

  • మెను బొత్తాన్ని నొక్కండి New Fx Menu Fx57Menu , help Help-29 Help నొక్కి About Firefox ఎంచుకోండి. మెనుబార్‌లో Firefox మెను నొక్కి About Firefox ఎంచుకోండి. ఫైర్‌ఫాక్సు గురించిన విండో కనిపిస్తుంది. ఫైర్‌ఫాక్సు పేరు క్రింద రూపాంతర సంఖ్య ఉంటుంది.
    "Here is an example of what the About Firefox window will look like:"
    Fx59.0.2AboutFirefox-macOS about firefox58.0.2 About Firefox Quantum - Linux
గమనిక: ఫైర్‌ఫాక్సు గురించి అనే విండో తెరవడం అనేది అప్రమేయంగా ఒక నవీకరణ తనిఖీని ప్రారంభిస్తుంది. ఫైర్‌ఫాక్సు నవీకరించిన రూపాంతరం అందుబాటులో ఉంటే అది స్వయంచాలకంగా దించుకోబడుతుంది. లీనక్సులో మీరు మొజిల్లా వెబ్సైటు నుండి దించుకున్న బిల్డ్ వాడినప్పుడే ఇలా జరుగుతుంది; లేకపోతే, నవీకరణలు మీ ప్యాకేజి నిర్వాహకి ద్వారా జరుగుతాయి. మరింత సమాచారం కోసం ఫైర్‌ఫాక్స్‌ను సరికొత్త వెర్షనుకు తాజాకరించుకోవడం చూడండి.
  • ప్రత్యామ్నాయంగా, మెను బొత్తము New Fx Menu Fx57Menu నొక్కండి, help Help-29 Help నొక్కి Troubleshooting Information ఎంచుకోండి. ఒక కొత్త ట్యాబులో "about:support" చిరునామాతో ఒక పేజీ కనిపిస్తుంది. ఈ పేజీలో "Application Basics" విభాగం క్రింద మీ ఫైరుఫాక్సు రూపాంతరం నమోదు చేయబడి ఉంటుంది. మరింత సమాచారం కోసం Use the Troubleshooting Information page to help fix Firefox issues చూడండి.
// These fine people helped write this article:Dinesh, చిలాబు. You can help too - find out how.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

మొజిల్లా తోడ్పాటులో స్వచ్ఛందంగా తోడ్పడండి