ఫైర్‌ఫాక్స్‌లో సురక్షితం కాని సంకేతపదం హెచ్చరిక

గమనిక: తాజా లక్షణాలు ఆస్వాదించడానికి దయచేసి ఫైర్ఫాక్సు యొక్క మీ వెర్షన్ నవీకరించండి.

మీరు చూస్తున్న లాగిన్ పేజీకి సురక్షితమైన అనుసంధానం లేకపోతే చిరునామా పట్టీలో ఎర్రగీతతో కొట్టివేసిన తాళంకప్ప బొమ్మని red strikethrough icon ఫైర్‌ఫాక్స్ చూపిస్తుంది. మీరు టైపు చేసే సంకేతపదం దొంగిలించబడే అవకాశం ఉందని మీకు తెలియజేయడానికే ఆ ఏర్పాటు.

ఫైర్‌ఫాక్స్ వెర్షను 52తో మొదలుకొని, మీరు వాడుకరి పేరుని లేదా సంకేతపదాన్ని టైపుచేయడానికి లాగిన్ పెట్టెలో నొక్కినప్పుడు, మీకు హెచ్చరిక సందేశం కూడా కనిపిస్తుంది.

Fx52insecurePW

గమనిక: మీరు లాగిన్ సమాచారాన్ని టైపుచెయ్యడం మొదలుపెట్టినప్పుడు, హెచ్చరిక సందేశం సంకేతపదం పెట్టెను కప్పేయవచ్చు. ఆ హెచ్చరికను తీసేయడానికి మీరు మీ వాడుకరి పేరు టైపు చేసిన తర్వాత EnterReturn మీటను నొక్కవచ్చు (లేదా సంకేతపదం పెట్టె బయట నొక్కవచ్చు).

లాగిన్ పేజీ సురక్షితం కాకుంటే నేను ఏమి చేయాలి?

మీ అభిమాన సైటు లాగిన్ పేజీ సురక్షితం కాకుంటే, ఆ పేజీకి సురక్షికమైన వెర్షను ఉందేమో అని చిరునామా పట్టీలో URLకు ముందు https:// టైపుచేయడం ద్వారా మీరు ప్రయత్నించి చూడవచ్చు. మీరు వెబ్‌సైటు నిర్వాహకులను వారి సైటు అనుసంధానాన్ని సురక్షితం చేయమని కూడా సంప్రదించవచ్చు.

సిఫారసు చేయబడలేదు: అనుసంధానం సురక్షితం కాకపోయినప్పటికీ మీరు వెబ్‌సైటు లోనికి లాగిన్ కావచ్చు, కానీ మీ బాధ్యత మీదే ఆ పని చేయండి. మీరు ఈ మార్గం ఎంచుకుంటే, ప్రత్యేకమైన లేదా మీరు ఇతర ముఖ్యమైన సైట్లలో వాడని సంకేతపదాన్ని వాడటానికి ప్రయత్నించండి.

సురక్షితం కాని పేజీల గురించి

అంతరంగిక సమాచారాన్ని, అంటే క్రెడిట్ కార్డు వివరాలు, వ్యక్తిగత సమాచారం, సంకేతపదాలు లాంటివాటిని, పంపించే పేజీలు మీ సమాచారం దొంగిలించబడకుండా నివారించేందుకు సురక్షిత అనుసంధానంతో ఉండాలి. (చిట్కా: సురక్షిత అనుసంధానం అయితే చిరునామా పట్టీలో ఆకుపచ్చని తాళంకప్ప బొమ్మతో పాటు "HTTPS" అని ఉంటుంది.)

ఎటువంటి అంతరంగిక సమాచారాన్ని పంపించని పేజీలు అరక్షిత అనుసంధాన్ని (HTTP) వాడవచ్చు. చిరునామా పట్టీలో HTTP అని చూపించే జాల పేజీలలో సంకేతపదాల వంటి అంతరంగిక సమాచారాన్ని ఇవ్వడం శ్రేయస్కరం కాదు. అరక్షిత అనుసంధానాలలో మీరు ఇచ్చే సమాచారం దొంగిలించబడవచ్చు.

డెవలపర్లకు గమనిక

ఈ హెచ్చరిక గురించి మరింత తెలుసుకోవాలనుకునే డెవలపర్లు, దయచేసి ఈ పేజీని చూడగలరు. ఫైర్‌ఫాక్స్ ఎందుకు ఎప్పుడు ఈ హెచ్చరికను చూపిస్తూందో, దీన్ని ఎలా పరిష్కరించాలో కూడా ఆ పేజీ వివరిస్తుంది. ఇంకా అదనపు సమాచారానికి ఈ బ్లాగు టపాను, ఈ సైటు అనుగుణ్యతా పత్రాన్ని చూడండి.

ఈ వ్యాసం ఉపయోగపడిందా?

దయచేసి వేచివుండండి…

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి