ఫైర్‌ఫాక్స్ పాత వెర్షన్‌ను స్థాపించుకోండి

రివిజన్ సమాచారం
  • రివిజన్ id: 173718
  • సృష్టించబడింది:
  • సృష్టికర్త: చిలాబు
  • వ్యాఖ్య: updated
  • పరిశీలించినవి: అవును
  • పరిశీలించినవి:
  • సమీక్షించినవారు: chilaabu
  • ఆమోదించబడిందా? అవును
  • ప్రస్తుత రివిజనా? అవును
  • స్థానికీకరణ కోసం సిద్ధంగా ఉన్నది: కాదు
రివిజన్ మూలం
రివిజన్ కంటెంట్

హెచ్చరిక: ఒక పాత వెర్షనుకు డౌన్‌గ్రేడ్ చేయడం వలన ఫైర్‌ఫాక్స్ వాడుకరి దత్తము పోవడం, ఇంకా పనితనం, భద్రత సమస్యలకు కారణం అవుతుంది. డౌన్‌గ్రేడ్ చేయవద్దని మా సలహా కనుక మీ స్వంత పూచీపై మీరు చేసుకోండి. మీరు ఒక పాత ఫైర్‌ఫాక్స్ వెర్షనును ఉపయోగించాల్సివస్తే, దయచేసి పాత వెర్షనుకు ఒక వేరే ఫైర్‌ఫాక్స్ ప్రొఫైలుని సృష్టించుట ద్వారా దత్తం పోవడాన్ని తగ్గించవచ్చు.

ఫైర్‌ఫాక్స్ నవీకరణతో తరచుగా సమస్య ఉంటే, ప్రజలు మునుపటి వెర్షనుకి తిరిగి మార్చుకునే మార్గం కోసం చూస్తారు. సాధారణంగా అది మీ సమస్యను పరిష్కరించలేదు మరియు మీ కంప్యూటర్, సమాచారాన్ని దాడికి దుర్బలంగా చేస్తుంది. మీరు డౌన్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటే, ఈ వ్యాసం డౌన్‌గ్రేడ్ చేసుకోడానికి కొన్ని ప్రత్యామ్నాయాలు మరియు ఫైర్‌ఫాక్స్ యొక్క పాత వెర్షన్ల లింకులు ఇస్తుంది.

మునుపటి వెర్షనును స్థాపించడం ద్వారానే చాలా సమస్యలు పరిష్కరించబడవు

నవీకరణ తరువాత వచ్చే సమస్యలు సాధారణంగా కొత్త ఫైర్‌ఫాక్స్ వెర్షను వలన కాదు, అవి నవీకరణ ప్రక్రియ వలన. మునుపటి వెర్షనును స్థాపించడం చాలా సందర్భాల్లో సహాయపడదు. దానికి బదులుగా, చూడండి:

గమనిక: ఇతర సమస్యలు ఫైర్ఫాక్స్ రిఫ్రెష్ సౌలభ్యంతో పరిష్కరించవచ్చు. మీ ముఖ్యమైన సమాచారాన్ని భద్రపరుస్తూ ఇది ఫైర్‌ఫాక్స్‌ని దాని అప్రమేయ స్థితికి పునరుద్ధరిస్తుంది.

అన్ని భద్రతా మరియు భద్రతా సంబంధిత సాఫ్ట్వేర్ పూర్తిగా నవీకరించబడిందని నిర్ధారించుకోండి. కొన్ని భద్రతా సాఫ్ట్వేరును ప్రతి ఫైర్‌ఫాక్స్ వెర్షను నవీకరణ తరువాత నవీకరించాల్సి ఉంటుంది.

భద్రతా సాఫ్ట్వేర్‌తో కూడిన ఐచ్ఛిక సాఫ్ట్వేర్‌ని కూడా నవీకరించాల్సి ఉంటుంది. ఇటువంటి సాఫ్ట్వేర్ మీ భద్రత కోసం అవసరం కాకపోవచ్చు, కానీ కాలం చెల్లి ఉంటే, ఇది ఫైర్‌ఫాక్స్ వినియోగంతో జోక్యము చేసుకోవచ్చు, లేదా ఫైర్ఫాక్స్ క్రాష్‌కు కారణం కావచ్చు.

నేను ఇంకా డౌన్‌గ్రేడ్ కావాలనే అనుకుంటున్నాను — మునుపటి వెర్షను నాకు ఎక్కడ దొరుకుతుంది?

పరీక్షల నిమిత్తం పాత ఫైర్‌ఫాక్స్ వెర్షన్లతో కూడిన మొజిల్లా వెబ్సైటు ఉన్నప్పటికీ, మీరు తాజా వెర్షనును తప్ప ఇతర వాటిని ఉపయోగించడం శ్రేయస్కరం కాదు.
హెచ్చరిక: ఫైర్‌ఫాక్స్ యొక్క పాత వెర్షన్లను ఉపయోగించడం వల్ల విశేషమైన భద్రతా ప్రమాదం పొంచి ఉంది.
ముఖ్యమైనది: అప్రమేయంగా, ఫైర్‌ఫాక్స్ స్వయంచాలకంగా నవీకరించుటకు అమర్చబడి ఉంటుంది. మీరు ఫైర్‌ఫాక్స్ యొక్క పాత వెర్షనును స్థాపించిన తరువాత, ఫైర్‌ఫాక్స్ స్వయంచాలకంగా కొత్త వెర్షనుకి నవీకరించడం నుండి నిరోధించడానికి మీ ఫైర్‌ఫాక్స్ నవీకరణ అమరికలను మార్చాలి: మెనూ బొత్తం New Fx MenuFx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి. General ప్యానెల్‌లో "ఫైర్‌ఫాక్స్ నవీకరణలు" విభాగానికి వెళ్ళండి.

డౌన్‌గ్రేడ్ చేయడానికి ప్రత్యామ్నాయాలు

ఫైర్‌ఫాక్స్‌ని ఒక పాత, భద్రత లేని వెర్షనుకు డౌన్‌గ్రేడు చేసి మీ నవీకరణ అమరికలను మార్చడం కంటే మీరు ఈ ప్రత్యామ్నాయాలను పరిగణించాలి:

ఫైర్‌ఫాక్స్ అధిక సహాయ విడుదలను స్థాపించు. ఫైర్‌ఫాక్స్ అధిక సహాయ విడుదల (ESR) అనేది విశ్వవిద్యాలయాలు, వ్యాపారాల వంటి పెద్ద సంస్థల కోసం తయారుచేసిన అధికారిక ఫైర్‌ఫాక్స్ వెర్షను. ఫైర్‌ఫాక్స్ ESR తాజా సౌలభ్యాలతో రాదు కానీ దానిలో తాజా భద్రత, స్థిరత్వ పరిష్కరణలు ఉంటాయి. మరింత సమాచారం కోసం [[Switch to Firefox Extended Support Release (ESR) for personal use] వ్యాసాన్ని చూడండి.

వేరే విహారిణి యొక్క తాజా వెర్షనును ఉపయోగించు.

ఫైర్‌ఫాక్స్‌ను మెరుగుపరచడానికి మాకు తోడ్పడండి

ఒకవేళ ఫైర్‌ఫాక్స్ యొక్క కొత్త వెర్షన్ వల్ల మీకు సమస్యలు వస్తే, లేదా మీకు దాని గురించి ఏదైనా నచ్చకపోతే దయచేసి దాని గురించి మీ స్పందనను ఇక్కడ పంచుకోండి: