ఆండ్రాయిడ్‌లో ఫైర్‌ఫాక్స్‌ను అప్రమేయ విహారిణి చేసుకోవడం

ఈ వ్యాసం యొక్క గడువు తేదీ ముగిసి ఉండవచ్చు.

ఒక ముఖ్యమైన మార్పు ఈ ఆధారపడిన ఇంగ్లీష్ వ్యాసంకు జరిగి ఉండవచ్చు. ఈ పేజీ నవీకరించబడే వరకు, మీరు దీన్ని సహాయకరంగా ఉండవచ్చుl: Make Firefox the default browser on Android

Firefox for Android Firefox for Android చివరిగా నవీకరించినది: 08/13/2018

మీ లంకెలను అప్రమేయంగా ఫైర్‌ఫాక్స్‌లో తెరవాలనుకుంటున్నారా? ఎలానో మేము చూపిస్తాము.

మీ ఆండ్రాయిడ్ వెర్షను నెంబరును చూడండి: ఈ సూచనలు మీ ఆండ్రాయిడ్ వెర్షనుపై ఆధారపడివుంటాయి. వెర్షనును మీ ఫోను లోని Settings మెనూలో About తెరవడం ద్వారా తెలుసుకోవచ్చు. (ప్రత్యేక సూచనల కోసం మీ ఫోను తయారీదారు వెబ్‌సైటులో చూడండి).

ఆండ్రాయిడ్ 6 (మార్ష్‌మెలో), ఆ పైన

 1. మీ ఫోనులో Settings ప్రతీకాన్ని తాకండి.
 2. Apps‌ను తట్టండి .
 3. పళ్ళచక్రం ప్రతీకాన్ని తట్టండి (మామూలుగా తెరలో కుడివైపు పైన ఉంటుంది).
 4. Default Apps‌ను తట్టండి.
 5. ఎంచుకోదగ్గ జాబితాను చూడడానికి Browser app తట్టండి.
 6. ఆ జాబితాలో ఫైర్‌ఫాక్స్‌ను తట్టండి.

అంతే!

పాత ఆండ్రాయిడ్ వెర్షనులు

అంచె 1: ప్రస్తుతం లంకెలను తెరిచే విహారిణి అమరికను తుడిచివేయండి

 1. Settings తెరిచి Apps మీద తాకండి. (కొన్ని ఆండ్రాయిడ్ వెర్షన్లలో ఈ బొత్తం "Application" అనే పేరుతో ఉండొచ్చు, తరువాతి అంచెకు ముందు మీరు Manage applications నొక్కవలసిరావచ్చు.)
 2. All అనే ట్యాబుపై తట్టండి.
  Android ICS Manage Apps - Cropped just showing stock
 3. ప్రస్తుతం లంకెలను తెరిచే విహారిణిపై నొక్కండి. ఇది మాములుగా అప్రమేయ విహారిణి "Browser" లేదా "Internet" అనే పేరుతో ఉండవచ్చు.
 4. ఈ విహారిణి లంకెలు తెరవకుండా ఉండటానికి Clear defaultsపై తాకండి. ఒక వేల "Clear defaults" అచేతనమై ఉంటే, మీరు మరో విహారిణిని స్థాపించుకోలేదు లేదా మీరు ఒపెరా వంటి మరో విహారిణిని స్థాపించుకొని దాన్ని అప్రమేయ విహారిణిగా అమర్చుకొని ఉండవచ్చు. మీరు వేరే విహారిణి స్థాపించుకొని ఉంటే, వెనక్కివెళ్ళి మునుపటి అంచెని అప్రమేయ విహారిణికి చెయ్యండి.
  Android ICS Clear defaults - Cropped

అంచె 2: లంకెలు తెరవడానికి అప్రమేయ విహారిణిగా ఫైర్‌ఫాక్స్‌ను అమర్చండి

 1. ఏదైనా ఆండ్రాయిడ్ అనువర్తనంలో ఒక లంకెను తెరవండి.
 2. Firefoxపై తాకి, ఆ తర్వాత Always‌ను తాకండి.
  Fennec_Default

ఈ వ్యాసం ఉపయోగపడిందా?

దయచేసి వేచివుండండి…

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి