ఫైర్‌ఫాక్స్ ముంగిలిపేజీని మీకు తగ్గట్టు మలచుకోవడం

ఆండ్రాయిడ్ కోసం ఫైర్‌ఫాక్స్ మీరు ఒక కొత్త ట్యాబు తెరిచినప్పుడు చూడాలనుకునే విషయాన్ని ఎంచుకోనిస్తుంది. దానిని మీకు నచ్చిన జాలగూడుకు అమర్చుకోవచ్చు లేదా ఫైర్‌ఫాక్స్ అప్రమేయ ముంగిలి పుటను చూపించేట్టు అమర్చుకోవచ్చు. ఇది అత్యంత లోకప్రియమైన జాలగూడులు, Pocket (now part of Mozilla)లో ఎక్కువమంది చదివిన కథలు, మీరు ఈమధ్య చూసిన లేదా బుక్‌మార్క్ చేసిన లాంటి గొప్ప సమాచారాన్ని చూపిస్తుంది.

ఆండ్రాయిడ్ కోసం ఫైర్‌ఫాక్స్‌లో "మేటి సైట్లు" ద్వారా మీరు ఇటీవల చూసిన లేదా బుక్‌మార్క్ చేసిన పేజీలను తెచ్చుకోవచ్చు. మీరు కొత్త వాడుకరి ఐతే, ఫైర్‌ఫాక్స్ అలెక్సా అత్యున్నత రాంకు గల సైట్లను చూపిస్తుంది. ఈ వ్యాసం సైట్లను పిన్ చేయడం, తీసివేయడం లేదా సవరించడం ద్వారా అత్యున్నత సైట్లను ఎలా నిర్వహించవచ్చో తెలుపుతుంది.

ప్యానెళ్ళను దాచడం లేదా క్రమం మార్చడం

 1. మెనూ బొత్తాన్ని తాకి ( కొన్ని పరికరాల్లో తెర కింద లేదా విహారిణిలో కుడిపైపు పైన మూలలో), తర్వాత అమరికలు తాకండి (ముందు మరిన్ని మెనూని తాకాల్సిరావచ్చు).
 2. సాధారణం తాకిన తర్వాత, ముంగిలి తాకండి.
 3. మీరు దాచాలనుకుంటున్న లేదా క్రమం మార్చాలనుకుంటున్న ప్యానెలుపై నొక్కండి: మేటి సైట్లు, ఇష్టాంశాలు లేదా చరిత్ర.
 4. ఈ కింది ఎంపికలలో ఒకదానిని ఎంచుకోండి:
  • అప్రమేయంగా చేయి: మీరు ఫైర్‌ఫాక్స్ తెరిచినప్పుడు లేదా కొత్త ట్యాబును తెరిచినప్పుడు మీకు మొదటగా ఈ ప్యానెల్ కనిపిస్తుంది.
  • దాచు: ఈ ప్యానెలును ముంగిలి తెర నుంచి తీసేస్తుంది.
  • క్రమం మార్చు: ప్యానెలును తెర ఎడమవైపుకో కుడివైపుకో కదుపుతుంది.

మేటి సైట్ల వ్యానెలులో అదనపు విషయాన్ని చూపించుట లేదా దాచుట

 1. మెనూ బొత్తాన్ని తాకి ( కొన్ని పరికరాల్లో తెర కింద లేదా విహారిణిలో కుడివైపు పైన మూనలో), తర్వాత అమరికలు తాకండి (ముందు మరిన్ని మెనూని తాకాల్సిరావచ్చు).
 2. సాధారణం తాకిన తర్వాత, ముంగిలి తాకండి.
 3. మేటి సైట్లుపై తాకండి.
 4. "అదనపు విషయం" కింద, మీరు చూడాలనుకుంటున్న ప్రతీ రకపు విషయం తర్వాత ఉన్న మీత నొక్కండి.

థంబ్‌నెయిళ్ళను సవరించడం

ఒక థంబ్‌నెయిల్‌పై ఒత్తి పట్టుకుంటే అది సైటు ఒక కొత్త లేదా అంతరంగిక ట్యాబులో తెరచుట, తీసివేయుట, ఇష్టాంశంగా గుర్తించుకోవడం, పంచుకొనుట, కాపీ లేదా పిన్ చేయుట అనే ఎంపికలనున్న మెనూని చూపిస్తుంది.

top sites context menu 57

వేరే వెబ్‌సైటుని మీ ముంగిలిపేజిగా ఉంచడం

ఫైర్‌ఫాక్స్ అప్రమేయ ముంగిలి పేజి కాకుండా ఒక ప్రత్యేక జాలపుటని చూపించే సూచనలకు Change the Homepage to a specific page చూడండి.

సైటును పిన్ చేయడం లేదా తీసివేయడం

ఒక సైటు మేటి సైట్లలో అలాగే ఉండిపోవడానికి, మీ మేటి సైట్ల తెరకు "పిన్" చేయండి. ముందుగా, సైటు ఫలకాన్ని ఒత్తి పట్టుకోండి, మెనూ వస్తుంది.

 • సైటును పిన్ చేయడానికి, సైటు పిన్‌చేయి అంశాన్ని తాకండి.
Pin Sites 2

ఈ సైటు మీ ముంగిలి తెరకు పిన్ చేయబడుతుంది.

Pin Sites 3 Pinned_Site
 • దాని పిన్ను తీసివేయడానికి, పైన ఉన్న అంచెలను మళ్ళీ చేసి సైటు పిన్‌తీయి తాకండి.
Unpin top site

సవరించడం

 • ఒక సైటును సవరించడానికి, దాని ఫలకాన్ని ఒత్తి పట్టుకోండి, వచ్చే మెనూలో సవరించు ఎంచుకోండి.
Edit Top Site
 • ఇక్కడ మీరు చిరునామా మార్చవచ్చు.
Edit Top Sites_2

తొలగించడం

 • ఒక సైటును తొలగించేందుకు, దాని ఫలకాన్ని ఒత్తి పట్టుకోండి, వచ్చే మెనూలో తొలగించు ఎంచుకోండి.
Remove_Site

పంచుకోవడం

 • ఒక సైటును ఇతరులతో పంచుకునేందుకు, దాని ఫలకాన్ని ఒత్తి పట్టుకోండి, వచ్చే మెనూలో పంచుకో ఎంచుకోండి.
Share_site
 • తర్వాత బ్లూటూత్, డ్రైవ్ లేదా ఇతర ఎంపికల ద్వారా పంచుకోండి.

చిరునామాని కాపీ చేసుకోవడం

 • సైటు చిరునామా కాపీ చేసుకోవడానికి, ని ఫలకాన్ని ఒత్తి పట్టుకోండి, వచ్చే మెనూలో చిరునామాను కాపీచెయ్యి ఎంచుకోండి.
Copy_Address

ఒక సైటును చేర్చడం

 • ఒక సైటును చేర్చుకోడానికి, కూడిక చిహ్నంతో ఉన్న ఖాళీ ఫలకాన్ని తాకండి.
Add_site Add_Site_42
 • తర్వాత జాలా చిరునామా ఇవ్వండి.
Add_site_1

మేటి సైట్ల తెరను దాచడం లేదా కనబడేలా చేయడం

మెనూ బొత్తం నొక్కి (కొన్ని పరికరాల్లో తెర అడుగున లేదా విహారిణి కుడివైపు పైన మూలలో) అమరికలు ఎంచుకోండి (ముందుగా మీరు More మీద తట్టవలసిరావొచ్చు) , తరువాత సాధారణం, ఆపై ముంగిలి ఎంచుకోండి, చివరిగా మేటి సైట్లు ఎంచుకోండి.

Customize Top Sites Steps_1-4
 • అక్కడ మీరు ఈ క్రింది మార్పులు చేసుకోవచ్చు:
 • ముంగిలి నుండి మేటి సైట్లను దాయడానికి, దాచు ఎంచుకోండి.
Hide_Top_Sites_new
 • మేటి సైట్లు ఇప్పటికే దాయబడి మీరు దాన్ని ముంగిలిలో చూడాలనుకుంటే, చూపించు ఎంచుకోండి.
Show_Top_Sites
 • మేటి సైట్లను అప్రమేయం చేసేందుకు, అప్రమేయంగా చేయి ఎంచుకోండి.
Default_top_site
 • మేటి సైట్ల క్రమం మార్చుకోడానికి, క్రమం మార్చు ఎంచుకోండి.
Change order of Top_Sites
// These fine people helped write this article:వీవెన్, Dinesh, చిలాబు. You can help too - find out how.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

మొజిల్లా తోడ్పాటులో స్వచ్ఛందంగా తోడ్పడండి