విండోస్ 10లో మీ అప్రమేయ విహారిణి మార్చుకోవడం ఎలా

ఈ వ్యాసం విండోస్ 10కి మాత్రమే వర్తిస్తుంది.
మీరు విండోస్ 10కి నవీకరించుకున్నప్పుడు, అనుకోకుండా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ను మీ అప్రమేయ విహారిణిగా మార్చుకొని ఉండవచ్చు. ఫైర్‌ఫాక్స్‌ను తిరిగి అప్రమేయ విహారిణిగా అమర్చుకోడానికి ఈ అంచెలను అసునరించండి.

  1. మెనూ బొత్తం New Fx MenuFx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.
  2. సాధారణం ప్యానెలులో, అప్రమేయం చేయిఅప్రమేయం చేయి… బొత్తాన్ని నొక్కండి.
    default 38Fx56GeneralPanelStartup-MakeDefaultBrowserFx57GeneralPanelStartup-MakeDefaultFx61GeneralPanelStartup-MakeDefault
  3. విండోస్ అమరికల అనువర్తనం Choose default apps అనే తెరతో తెరుచుకుంటుంది.
  4. కిందికి వెళ్ళి Web browser అనే విభాగాన్ని నొక్కండి. ఇప్పుడు అక్కడ ప్రతీకం Microsoft Edge లేదా Choose your default browser అని చెప్తుంది.
    default apps win10
  5. Choose an app తెరలో, Firefox మీద నొక్కి దాన్ని అప్రమేయ విహారిణిగా అమర్చుకోండి.
    firefox default 10
  6. ఫైర్‌ఫాక్స్ ఇప్పుడు అప్రమేయ విహారిణిగా చూపించబడుతుంది. మీ మార్పులను భద్రపరచడానికి విండోను మూసివేయండి.

ఈ వ్యాసం ఉపయోగపడిందా?

దయచేసి వేచివుండండి…

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి