ఫైర్‌ఫాక్స్ నియంత్రణలు బొత్తాలు టూల్‌బార్‌లు అనుకూలీకరించండి

మెను బొత్తము new fx menu మీకు ఇష్టమైన ఫైర్‌ఫాక్స్ లక్షణాలకు సౌకర్యవంతంగా దారినిస్తుంది. అప్రమేయ ఏర్పాటు నచ్చలేదా? సులభంగా అనుకూలీకరించవచ్చు. మీరు ఎల్లవేళలా ఉపయోగించేది ఏదైనా ఉందా? దానిని ప్రధాన టూల్‌బార్‌కు జోడించుకోండి. అది ఎలాగో మేము తెలియజేస్తాము.

ఫైర్‌ఫాక్స్ యొక్క టూల్‌బార్ తరచు వాడే లక్షణాలకు సులువైన దారినిస్తుంది. మీరు చాలా ఎక్కువగా ఉపయోగించేదేదైనా మీకు కనబడలేదా? ఈ టూల్‌బార్‌ని అనుకూలీకరించడం చాలా సులువు. మీరు ఎప్పుడూ ఉపయోగించనిది ఏదైనా ఉందా? దాన్ని ఓవర్‌ఫ్లో మెనుకి జతచేయవచ్చు. అది ఎలాగో మేము తెలియజేస్తాము.

అధిక మెను లేదా టూల్‌బార్‌ని అనుకూలీకరించు

అధిక మెను లేదా మీ టూల్‌బార్‌లో కనబడే అంశాలను మీరు మార్చవచ్చు.

 1. మెను బొత్తము Fx57Menu నొక్కి 57customize-icon.png Customize… ఎంచుకోండి.
  • ఒక ప్రత్యేక ట్యాబు తెరచుకుంటుంది, ఇది అంశాలను అధిక మెను మరియు టూల్‌బార్‌ల లోకి లేదా బయటకు లాగి వదలడాన్ని అనుమతిస్తుంది. మీకు ఏది చక్కగా పనిచేస్తుందో పరీక్షించి చూడండి. తెర క్రిందనున్న Restore Defaults బొత్తాన్ని నొక్కి మీరు మరల మొదలుపెట్టవచ్చు.
  Fx57Customize customize-fx57-linux
 2. మీ పని పూర్తి అయిన తరువాత, Done బొత్తాన్ని నొక్కండి.

శీర్షిక బార్, మెను బార్ లేదా ఇష్టాంశాల టూల్‌బార్ ఆరంభించుట

 1. Fx57Menu మెను బొత్తముపై నొక్కి 57customize-icon.png Customize… ఎంచుకోండి.
  • శీర్షిక బార్‌ను ఆరంభించుటకు: క్రింద ఎడమవైపున ఉన్న శీర్షిక బార్ పక్కనున్న డబ్బాను ఎంచుకోండి.
  • మెను బార్ లేదా ఇష్టాంశాల బార్‌ను ఆరంభించుటకు: తెర దిగువనున్న Toolbars డ్రాప్‌డౌన్ మెనుని నొక్కి మీరు చూపించాలనుకున్న టూల్‌బార్స్ ఎంచుకోండి.
   Fx57Customize-Toolbars
 2. Done బొత్తాన్ని నొక్కండి.

శీర్షిక బార్ లేదా ఇష్టాంశాల టూల్‌బార్ ఆరంభించుట

 1. Fx57Menu మెను బొత్తముపై నొక్కి 57customize-icon.png Customize… ఎంచుకోండి.
  • శీర్షిక బార్‌ను ఆరంభించుటకు: క్రింద ఎడమవైపున ఉన్న శీర్షిక బార్ పక్కనున్న డబ్బాను ఎంచుకోండి.
  • ఇష్టాంశాల టూల్‌బార్ ఆరంభించుటకు: తెర దిగువనున్న Toolbars డ్రాప్‌డౌన్ మెనుని నొక్కి Bookmarks Toolbarని ఎంచుకోండి.
 2. Done బొత్తాన్ని నొక్కండి.
గమనిక:" తెర ఎగువనున్న మెను బార్ నుండి కూడా మీరు ఇష్టాంశాల టూల్‌బార్‌ని ఆరంభించవచ్చు లేదా ఆపవచ్చు: View నొక్కి, దిగువన ఉన్న Toolbarsలో Bookmarks Toolbar ఎంచుకోండి.

మెను బార్ లేదా ఇష్టాంశాల టూల్‌బార్ ఆరంభించుట

 1. Fx57Menu మెను బొత్తముపై నొక్కి 57customize-icon.png Customize… ఎంచుకోండి.
 2. తెర దిగువన ఉన్న Toolbars డ్రాప్‌డౌన్ మెనుపై నొక్కి మీరు చూపించాలనుకున్న టూల్‌బార్స్ ఎంచుకోండి.
customize-fx57-linux-toolbars
 1. Done బొత్తముపై నొక్కండి.

మెను లేదా టూల్‌బార్ అనుకూలీకరించుట

మీరు మెను లేదా మీ టూల్‌బార్ లో కనిపించే అంశాలను మార్చవచ్చు.

 1. new fx menu మెను బొత్తముపై నొక్కండి మరియు Customize ఎంచుకోండి.
  • ఒక ప్రత్యేక ట్యాబు తెరచుకుంటుంది, ఇది అంశాలను మెను మరియు టూల్‌బార్‌ల లోకి లేదా బయటకు లాగి వదలడాన్ని అనుమతిస్తుంది. మీకు ఏది చక్కగా పనిచేస్తుందో పరీక్షించి చూడండి. తెర క్రిందనున్న Restore Defaults బొత్తాన్ని నొక్కి మీరు మరల మొదలుపెట్టవచ్చు.
  Customize Fx 29 Win8 Customize_fx55-win
 2. మీ పని పూర్తయినపుడు, ఆకుపచ్చని Exit Customize బొత్తాన్ని నొక్కండి.
గమనిక: అనేక కూర్పులు మీరు మెను లేదా టూల్‌బార్‌కి జోడించగలిగే బొత్తాలతో వస్తాయి. మరింత తెలుసుకోవడానికి వెతుకుము మరియు పొడగింతలు ఫైర్ఫాక్స్ లక్షణాలను జోడించడానికి ఇన్స్టాల్ చూడండి.

శీర్షిక బార్, మెను బార్ లేదా ఇష్టాంశాల టూల్‌బార్ ఆరంభించుట

toolbars-dropdown-menu_fx55

శీర్షిక బార్‌ను ఆరంభించుటకు:

 1. new fx menu మెను బొత్తాన్ని నొక్కండి మరియు Customize ఎంచుకోండి.
 2. Title Bar బొత్తముపై నొక్కి దిగువ ఎడమవైపు ఉన్న శీర్షిక బార్ ఎంపిక డబ్బాని ఎంచుకోండి
 3. ఆకుపచ్చని Exit Customize బొత్తాన్ని నొక్కండి.

మెను బార్ లేదా ఇష్టాంశాల టూల్‌బార్ ఆరంభించుటకు:

 1. [Image:new fx menu]] మెను బొత్తాన్ని నొక్కండి మరియు Customize ఎంచుకోండి.
 2. తెర దిగువనున్న Show / Hide ToolbarsToolbars డ్రాప్‌డౌన్ మెను నొక్కి మీరు చూపించాలనుకునే అంశాలను ఎంచుకోండి.
 3. ఆకుపచ్చ Exit Customize బొత్తాన్ని నొక్కండి.

శీర్షిక బార్ లేదా ఇష్టాంశాల టూల్‌బార్ ఆరంభించుట

శీర్షిక బార్ ఆరంభించుటకు:

 1. new fx menu మెను బొత్తముపై నొక్కి, Customize ఎంచుకోండి.
 2. దిగువ ఎడమవైపు ఉన్న Title Bar బొత్తాన్ని నొక్కండి.
 3. ఆకుపచ్చ Exit Customize బొత్తాన్ని నొక్కండి.

ఇష్టాంశాల టూల్‌బార్ ఆరంభించుటకు:

 • తెర ఎగువన ఉన్న View మెనుని నొక్కి, క్రింద ఉన్న Toolbars కి వెళ్ళి Bookmarks Toolbarను ఎంచుకోండి.

శీర్షిక బార్ లేదా ఇష్టాంశాల టూల్‌బార్ ఆరంభించుట

 1. new fx menu మెను బొత్తముపై నొక్కి, Customize ఎంచుకోండి.
 2. తెర దిగువనున్న Show / Hide ToolbarsToolbars డ్రాప్‌డౌన్ మెను నొక్కి మీరు చూపించాలనుకునే అంశాలను ఎంచుకోండి.
 3. ఆకుపచ్చ Exit Customize బొత్తాన్ని నొక్కండి.

సమస్యలున్నాయా?

మీరు అనుకూలీకరించు రీతిలో ఉన్నపుడు Restore Defaults బొత్తాన్ని నొక్కడం ద్వారా అప్రమేయ బొత్తాల, టూల్‌బార్ల సమూహాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించవచ్చు. దానివలన సమస్య పరిష్కరించబడకపోతే, ఇవి ప్రయత్నించండి:

// These fine people helped write this article:NikhilPatel, Dinesh, చిలాబు. You can help too - find out how.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

మొజిల్లా తోడ్పాటులో స్వచ్ఛందంగా తోడ్పడండి