ఫైర్‌ఫాక్సులో అడోబె ఫ్లాషును "నొక్కడం ద్వారా ప్రదర్శించు"గా అమర్చుట

ఈ వ్యాసం చాలా కాలంగా నిర్వహించబడలేదు, కాబట్టి దాని కంటెంట్ పాతది అయ్యుండవచ్చు.

గమనిక: ఈ వ్యాసం ఒక ముందరి ఫైర్‌ఫాక్సు రూపాంతరం కొరకు వ్రాయబడినది. ఫైర్‌ఫాక్సు 55వ రూపాంతరం నుండి ఫ్లాష్ ప్లగిన్ అప్రమేయంగా "నొక్కడం ద్వారా ప్రదర్శించు"గా పనిచేస్తుంది. మరింత సమాచారం కోసం ప్లగిన్లను నొక్కుతో చేతనం ఎందుకు చేసుకోవాలి? వ్యాసాన్ని చూడండి.

కొన్ని వెబ్సైట్లు కంటెంటును చూపించడానికి అడోబె ఫ్లాషును ఉపయోగిస్తాయి. కానీ, దాడిచేసేవారు ఫ్లాష్‌లోని భద్రతా దోషాలను వాడి కూడా మీ కంప్యూటరుపై హాని తలపెట్టే సాఫ్టువేరు నడపటంద్వారా మీ సిస్టంలోకి ప్రవేశించగలరు.

ఫ్లాషును అప్రమేయం చేయుట లేదా తీసివేయుట ద్వారా మిమ్మల్ని రక్షించుకోవడం ఒక విధం, కానీ మీచే విశ్వసించబడే వెబ్సైట్లకు ఫ్లాష్ కావాల్సినప్పుడు మీ ప్లగిన్ అమరికలను మార్చుకోవడం ద్వారా మీరు నొక్కి క్రియాత్మకం చేసినప్పుడే ఫ్లాష్ పనిచేసేట్టు మార్చుకోవచ్చు.

అడినప్పుడే ఫ్లాష్ నడిచేట్టు ఇలా అమర్చుకోవచ్చు:

  1. ఫైర్ఫాక్సు విండో ఎగువన, బటన్ ఫైర్ఫాక్సు నొక్కండి మెనూ బార్ లో, మెనూ ని టూల్స్ నొక్కండి ఫైర్ఫాక్సు విండో ఎగువన, మెనూ ని టూల్స్ నొక్కండి , మరియు ఆ తరువాత నొక్కండి ఆడ్-ఆన్స్. ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది. మెనూ బటన్ నొక్కండి New Fx Menu మరియు ఎంచుకోండి ఆడ్-ఆన్స్. ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది.

  2. ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ లో, ఎంచుకోండి Plugins పెనెల్.
  3. మీ జాబితాలో "షాక్‌వేవ్ ఫ్లాష్" కోసం వెదకండి. దానిని Ask to Activateగా అమర్చుకోండి.
    Flash-Ask-to-Activate

ఆ తరువాత నుండి మీరు ఫ్లాష్ అవసరమైన వెబ్సైటును దర్శించినపుడు, అవసరమైతే, అడోబె ఫ్లాష్‌ని క్రియాత్మకం చేసే ప్రాంప్టుపై నొక్కడం ద్వారా ఈ ప్లగిన్‌ని అనుమతించండి*:

activate flash prompt

మీరు ప్రాంప్టును నొక్కి ప్లగిన్‌ను అనుమతించిన తరువాత లోపించిన కంటెంట్ మామూలుగా లోడ్ అవుతుంది. అలా అవ్వకపోతే, పేజీని తిరిగి లోడ్ చేయండి (చిరునామా బార్‌లోని రిలాడ్ FxReloadButton బొత్తాన్ని నొక్కండి) మరియు మరల ప్రయత్నించండి.

*ఫ్లాష్‌ను క్రియాత్మకం చేయడానికి ముందు: విశ్వసనీయమైన వెబ్సైట్లకు మరియు కంటెంట్ ప్రద్దతలకు మాత్రమే ఫ్లాష్‌ని అనుమతించండి. ప్రకటనలు, బయటి వారి కంటెంట్ లేదా మీరు విశ్వసించని సైట్లకు ఫ్లాష్‌ను క్రియాత్మకం చేయడం మానివేయండి.
// These fine people helped write this article:చిలాబు. You can help too - find out how.
మొజిల్లా తోడ్పాటులో స్వచ్ఛందంగా తోడ్పడండి