లినక్స్‌లో ఫైర్‌ఫాక్స్ స్థాపించుకోవడం

ఫైర్‌ఫాక్స్‌ను వాడుకోడానికి మొదటి మెట్టు దాన్ని మీ కంప్యూటర్లో స్థాపించుకోవడం. లినక్స్‌లో ఫైర్‌ఫాక్స్‌ను ఎలా స్థాపించుకోవచ్చో ఈ వ్యాసం చూపిస్తుంది. ఇతర నిర్వాహక వ్యవస్థల కొరకు, విండోస్‌లో ఫైర్‌ఫాక్సుని ఎలా దించుకుని స్థాపించుకోవాలి?, మాక్ లో ఫైర్‌ఫాక్స్ దింపుకోలు మరియు స్థాపితం చేయు విధానం లను చూడండి.

అనేక లినక్స్ పంపిణీలు ఫైర్‌ఫాక్స్‌ని అప్రమేయంగా అందిస్తున్నాయి, చాలా వాటిలో ఉండే ప్యాకేజీ నిర్వహణ వ్యవస్థ మిమ్మల్ని ఫైర్‌ఫాక్స్‌ని తేలికగా స్థాపించుకోనిస్తుంది. సాధారణంగా, మీరు ప్యాకేజీ నిర్వహణ నుండే స్థాపించుకోవాలి. ప్యాకేజీ నిర్వహణ అనేది:

 • అవసరమైన లైబ్రరీలన్నీ కలిగి ఉన్నారో లేదో చూస్తుంది
 • మీ పంపిణీకి అనుగుణంగా పనిచేసే విధంగా ఫైర్‌ఫాక్స్‌ని స్థాపిస్తుంది
 • ఫైర్‌ఫాక్స్‌ను తెరవడానికి షార్టుకట్లను సృష్టిస్తుంది
 • మీ కంప్యూటరును వాడుకునే వాడుకరులందరికీ ఫైర్‌ఫాక్స్‌ను అందుబాటులో ఉంచుతుంది
 • ఫైర్‌ఫాక్స్‌ను తొలగించుకోవడం ఇతర అనువర్తనాలను తొలగించుకునేట్టే ఉండేలా చూస్తుంది

ప్యాకేజీ నిర్వహణకు కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి:

 • అది మీకు సరికొత్త ఫైర్‌ఫాక్స్ వెర్షనును ఇవ్వకపోవచ్చు
 • అది మీకు ఫైర్‌ఫాక్స్ చిహ్నం లేని వెర్షనును ఇవ్వవచ్చు

ప్యాకేజీ మేనేజర్ నుండి స్థాపించుకోవడం

ప్యాకేజీ మేనేజరు ద్వారా ఫైర్‌ఫాక్స్‌ను స్థాపించుకోడానికి, మీరు వాడే లినక్స్ పంపిణీ వారి పత్రికీకరణను చూడండి.

ప్యాకేజీ మేనేజర్ ద్వారా కాకుండా స్థాపించుకోవడం

ప్యాకేజీ మేనేజరు ద్వారా కాకుండా ఫైర్‌ఫాక్స్‌ను స్థాపించుకోడానికి పూర్తి సూచనలు మీ పంపిణీ వారి తోడ్పాటు వెబ్‌సైటులో ఉండవచ్చు. ఉదాహరణకి:

 • మీరు ఫైర్‌ఫాక్స్‌ను స్థాపించుకునే ముందు, మీ కంప్యూటరులో అవసరమైన లైబ్రరీలు స్థాపించివుండేలా చూసుకోండి. లేని లైబ్రరీలు ఫైర్‌ఫాక్స్‌ను పనిచేయనీయవు.
 • మొజిల్లా అందించిన .tar.bz2 ఫార్మాటులోని స్థాపన ఫైలులో మూలాలు ఉండవు కానీ ముందుగా-సంకలనించిన బైనరీ ఫైళ్ళు ఉంటాయి, అందువల్ల మీరు తేలికగా అన్‌ప్యాక్ చేసి వాటిని నడపవచ్చు. మూలం నుండి ప్రోగ్రాముని సంకలనించాల్సిన అవసరం లేదు.
 • కింది సూచనలు ఫైర్‌ఫాక్స్‌ను మీ ముంగిలి సంచయంలో స్థాపిస్తాయి, ప్రస్తుత వాడుకరి మాత్రమే దాన్ని నడుపుకోగలరు.
 1. ఫైర్‌ఫాక్స్ దింపుకోలు పేజీనుండి మీ ముంగిలి సంచయానికి ఫైర్‌ఫాక్స్‌ను దించుకోండి.
 2. ఒక టెర్మినల్ తెరిచి మీ ముంగిలి సంచయానికి వెళ్ళండి: cd ~
 3. దించుకున్న ఫైలు నుండి విషయాలను వెలికితీయండి: tar xjf firefox-*.tar.bz2
 4. ఫైర్‌ఫాక్స్ తెరిచివుంటే మూసివేయండి.
 5. ఫైర్‌ఫాక్స్‌ను మొదలుపెట్టడానికి, firefox సంచయంలోని firefox అనే స్క్రిప్టును నడపండి: ~/firefox/firefox

ఇప్పుడు ఫైర్‌ఫాక్స్ మొదలవ్వాలి. ఆ తర్వాత ఆ ఆదేశాన్ని మీరు నడపడానికి మీ డెస్కుటాపుపై ఒక ప్రతీకాన్ని సృష్టించుకోండి.

libstdc++5 పొరపాటు

పైన పేర్కొన్నట్లుగా, ఫైర్‌ఫాక్స్ పనిచేయడానికి మీరు కావలసిన లైబ్రరీలను స్థాపించుకోవాలి. చాలా పంపిణీలు అప్రమేయంగా libstdc++5‌ను అందించవు.

"firefox not installed" సందేశం లేదా తప్పుడు ఫైర్‌ఫాక్స్ వెర్షను మొదలయింది

పైన ఇచ్చిన సూచనలను అనుసరించి ఫైర్‌ఫాక్స్ స్థాపితమై ఉంటే, దాన్ని (టెర్మినల్ ‌లో లేదా డెస్కుటాపు లాంచరు ద్వారా) ఈ ఆదేశాన్ని వాడి మాత్రమే మొదలుపెట్టాలి: ~/firefox/firefox

మీరు టెర్మినల్‌లో ఫైర్‌ఫాక్స్‌ను ఈ ఆదేశం ద్వారా మొదలుపెట్టడానికి ప్రయత్నిస్తే: firefox, అది ప్యాకేజీ మేనేజరు ద్వారా స్థాపించిన ఫైర్‌ఫాక్స్‌ను తెరుస్తుంది లేదా ప్రోగ్రాము స్థాపితం కాలేదు అని మీకు చెప్తుంది.

// These fine people helped write this article:వీవెన్, Jayesh Katta Ramalingaiah, చిలాబు. You can help too - find out how.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

మొజిల్లా తోడ్పాటులో స్వచ్ఛందంగా తోడ్పడండి