థండర్‌బర్డ్ 52.0 వెర్షనులో వాడుకరులకు కనబడే ముఖ్య మార్పులను ఈ వ్యాసం వివరిస్తుంది. అన్ని మార్పుల పూర్తి వివరాలను థండర్‌బర్డ్ 52 విడుదల విశేషాలలో చూడవచ్చు.
థండర్‌బర్డ్ 45.0 వెర్షనుతో పోలిస్తే, దీనిలో వాడుకరులకు కనబడే మార్పులు చాలా తక్కువే కానీ, చాలా కాలం నుండి ఉన్న దోషాలు, చికాకులు పరిష్కరించబడ్డాయి.
విషయాల పట్టిక
మెయిల్ వ్రాయుట
అతి ముఖ్యమైన మార్పు ఏమిటంటే మెయిల్ వ్రాయు విండోలో బొమ్మలను చేర్చు విధానము. బొమ్మలు ఇపుడు, వేరే సందేశాల భాగాల సూచనలుగా లేక నిర్వాహక వ్యవస్థ ఫైళ్ళగా కాక, డేటా URIలుగా చేర్చబడతాయి. దీనివలన MS ఆఫీస్ లేదా లిబ్రఆఫీస్ వంటి ఆఫీసు పాకేజీలతో ఇంకా బాగా పనిచేయవచ్చు. ఇది ఎప్పటినుండో అపరిష్కృతంగా ఉన్న బొమ్మలను వేరే సందేశాలకు చేర్చలేకపోతున్న సమస్యను కూడా పరిష్కరిస్తుంది. అంతర్జాలంలోని వివిధ చోట్ల నుండి లంకె చేసిన బొమ్మలు "ఇకపై" స్వయంచాలకంగా దింపుకోవడం, సందేశానికి జోడించడం జరగదు. బొమ్మ లక్షణాల ద్వారా దీన్ని ప్రతీ బొమ్మకీ మార్చుకోవచ్చు లేదా mail.compose.attach_http_images అనే అభిరుచిని అమర్చుకోవడం ద్వారా సార్వత్రికంగా మార్చుకోవచ్చు.
డాటా URIలు వాడుకరి ఇంటర్‌ఫేసులో చూపించే ముడి బైనరీ డేటాగా చూపించబడతాయి, కనుక బొమ్మ లక్షణాల డైలాగు లోనూ, HTML చొప్పింపు డైలాగు లోనూ కురచ చేయబడ్డాయి. ఉదా:
కంపోజ్ విండోలో నిర్వాహక వ్యవస్థ ఫైళ్ళను బొమ్మలుగా అతికించేటప్పుడు, ఆ బొమ్మ నిరోధించబడి ఒక గమనిక కనిపిస్తుంది:
వాడుకరులు అజాగ్రత్తగా తమ ఫైళ్ళను చూపించకుండా సంరక్షిస్తుంది.
ప్రధాన సందేశపు విండో - సంచయపు పేన్
సంచయపు పేన్‌లో ఇప్పుడు పైన సంచయపు పేన్ పనిముట్లపట్టీ ముందుగానే స్వరూపించిన వివిధ సంచయ దర్శనాలతో వస్తుంది. ఈ సంచయపు పేన్ పనిముట్లపట్టీని View మెనూ > Toolbars ద్వారా చేతనించుకోవచ్చు.
ప్రధాన విండో - థ్రెడ్ పేన్
సంప్రదించువారు వరుస కొత్త ప్రతీకాలతో ఇప్పుడు అన్ని సంచయాలకు అప్రమేయం. అయితే దీన్ని బలవంతంగా అమలుచేయడం లేదు. దీన్ని mail.threadpane.use_correspondents అనే అభిరుచి ద్వారా అచేతనించుకోవచ్చు.
క్యాలెండర్ - లైట్‌నింగ్ - ట్యాబులో కార్యక్రమం
కార్యక్రమాలు ఇప్పుడు ఒక ట్యాబులో సృష్టించవచ్చు, సరిదిద్దవచ్చు. ఈ ఎంపికను చేతనించుకోడానికి, ToolsEditThunderbird మెనూ > OptionsPreferences > Calendar > General ట్యాబులో ఎంచుకోండి.
ఈ వ్యాసాన్ని పంచుకోండి: https://mzl.la/2JrB5nR