ఫైరుఫాక్సు ఓఎస్ లోని సమస్యలను పరిష్కరించు

ఈ వ్యాసం చాలా కాలంగా నిర్వహించబడలేదు, కాబట్టి దాని కంటెంట్ పాతది అయ్యుండవచ్చు.

మీరు మీ పరికరం లేదా ఆప్ లోని సమస్యలను పరిష్కరించే దశలను ఈ అధికరణం లో సూచించటం జరిగింది.

Important: మీరు మీ పరికరం సరిగా పని చేయ్యుటలేదు అని భావిస్తే దయచేసి మీరు మీ రేటైలేర్ ని కలిసి హార్డువేర్ సమస్య ఉందేమో ధ్రువీకరించుకొండి.
Important: మీకు మీ బిల్లు గురించి ఏమైనా సందేహాలు ఉంటే, మీ క్యారియర్ ను సంప్రదించండి.

స్తంభింపచేసిన లేదా స్పందించడం లేని అప్ప్ ని మూసివేయండి

మీరు సులభంగా ఆప్ స్విచ్చర్ ని ఉపయోగించి ఒక ఆప్ ని విడిచి వెళ్ళొచ్చు.

  1. పరికరం యొక్క దిగువన గల హోమ్ బటన్ ని నొక్కి ఉంచండి.
  2. ఆప్ స్విచ్చర్ మీ పని చస్తున్న ఆప్ ల చిత్రాలతో కనిపిస్తుంది.
  3. మీరు మూసివేయాల్సిన ఆప్ ను కనుగొనేందుకు చిత్రాలను స్వైప్ చెయ్యండి (మీకు ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్లు ఓపెన్ లో ఉంటే).
  4. ఆప్ ను ముగించటానికి స్క్రీన్ ఎడమ వైపు పై భాగం లో గల X నొక్కండి లేదా పైకి స్వైప్ చెయ్యండి.
    How to close an app
  5. హోమ్ స్క్రీన్ కి తిరిగి రావటానికి హోమ్ బటన్ ను నొక్కండి.

మరి కొన్ని వివరాలకోసం Switch or quit apps.

ఖచ్చితంగా మీరు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయ్యారో లేదో చూసుకోండి

కొన్ని ఆప్ లు పని చేయడానికి డేటా కనెక్షన్ అవసరం. మీరు Wi-Fi లేదా డేటా అనుసంధాన కలిగి ఉన్నారని ధృవీకరించండి.

  1. స్క్రీన్ పై భాగం నుండి నోటిఫికేషన్ ట్రే ని క్రిందకు లాగండి.
    Internet connection
  2. వైఫై లేదా డేటా అనుసంధాన చిహ్నం నీలి రంగులో లేకపోతే, మళ్ళీ కనెక్ట్ చేయడానికి ఆ చిహ్నం పైనే నొక్కండి.

వివరాల కోసం Connect to Wi-Fi or data.

ఆధునీకరణ కోసం వెదుకు

సిస్టం యొక్క మరియు ఆప్ ల యొక్క అధునాతన వెర్షన్ ల కొరకు వెతుకుట క్రింద తెలుపబడింది :

గమనిక: మీ పరికరం తయారీదారు, మీ సర్వీస్ ప్రొవైడర్ తో కలిసి, మీకు కావలసిన వ్యవస్థ నవీకరణలను అందించడం వారి బాధ్యత

  1. మీ పరికరం లోని సెట్టింగ్ల ఆప్ ని తెరవండి.
  2. క్రిందికి స్క్రోల్ చేసి Device విభాగం లో Device information ను ఎంచుకోండి.
  3. డివైస్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ నందు గల Software updatesకు వెళ్లి Check now ని నొక్కండి.

వివరాల కోసం Update to a new version

మీ పరికరాన్ని రీస్టార్ట్ చెయ్యండి

త్వరగా రీస్టార్ట్ చెయ్యడం చాల సమస్యలను పరిష్కరిస్తుంది.

మీ పరికరాన్ని రీస్టార్ట్ చెయ్యాడానికి పవర్ బటన్ ని నొక్కి ఉంచి తరువాత Restart Phone ను ఎంపిక చెయ్యాలి . మీ పరికరం స్పందించక పోతే బలవంతంగా రీస్టార్ట్ చెయ్యాలి.

  1. పరికరం యొక్క బ్యాటరి కవర్ ని తెరవండి.
  2. బ్యాటరి ని బయటకు తీసి మళ్ళి లోపల అమర్చండి.
  3. పరికరం యొక్క బ్యాటరి కవర్ ని తిరిగి దాని స్థానం లో అమర్చండి.
  4. పవర్ బటన్ ని పట్టుకొని మీ పరికరాన్ని తిరిగి ఆన్ చెయ్యండి.

మీ పరికరాన్ని రీస్టార్ట్ చెయ్యాడానికి పవర్ బటన్ ని నొక్కి ఉంచి తరువాత Restart ను ఎంపిక చెయ్యాలి . మీ పరికరం స్పందించక పోతే బలవంతంగా రీస్టార్ట్ చెయ్యాలి.

  1. పరికరం యొక్క బ్యాటరి కవర్ ని తెరవండి.
  2. బ్యాటరి ని బయటకు తీసి మళ్ళి లోపల అమర్చండి.
  3. పరికరం యొక్క బ్యాటరి కవర్ ని తిరిగి దాని స్థానం లో అమర్చండి.
  4. పవర్ బటన్ ని పట్టుకొని మీ పరికరాన్ని తిరిగి ఆన్ చెయ్యండి.

పరికరాన్ని రీసెట్ చెయ్యడం

Warning: మీ పరికరాన్ని రీసెట్ చేసిన యెడల అందులోని ఆప్ లు, పరిచయాలు, ఇమెయిల్, సందేశాలు, క్యాలెండర్లు మరియు సెట్టింగ్లు వంటి మీ డేటా, తొలగిపోతాయి. మీ పరికరం మొదట కొనుగోలు చేసినప్పుడు ఎలా ఉందొ ఆ విధంగా కనిపిస్తుంది. ఈ స్టెప్ ని చివరి పరిష్కారంగా ఉపయోగించండి .
  1. మీ పరికరం లోని సెట్టింగ్ల ఆప్ ని తెరవండి.
  2. క్రిందికి స్క్రోల్ చేసి Device విభాగం లో Device information ను ఎంచుకోండి.
  3. Device information స్క్రీన్ నందు గలMore Informationను నొక్కండి.
  4. ముందుగ Reset phone బటన్ నొక్కండి. తరువాత OKబటన్ పై నొక్కి రీసెట్ ని నిర్ధారించండి.

మీరు ఇంతకు ముందుగా కొనుగోలు చేసిన ఆప్ లను మార్కెట్ ప్లేస్ నందు సైన్ ఇన్ చేసి మై అప్ప్స్ విభాగం లో తిరిగి ఇన్స్టాల్ చేయవచ్చు. మరిన్ని వివరాల కోసంWhat 1is the Marketplace?

Warning: మీ పరికరాన్ని రీసెట్ చేసిన యెడల అందులోని ఆప్ లు, పరిచయాలు, ఇమెయిల్, సందేశాలు, క్యాలెండర్లు మరియు సెట్టింగ్లు వంటి మీ డేటా, తొలగిపోతాయి. మీ పరికరం మొదట కొనుగోలు చేసినప్పుడు ఎలా ఉందొ ఆ విధంగా కనిపిస్తుంది. ఈ స్టెప్ ని చివరి పరిష్కారంగా ఉపయోగించండి.
  1. మీ పరికరం లోని సెట్టింగ్ల ఆప్ ని తెరవండి.
  2. క్రిందికి స్క్రోల్ చేసి Device విభాగం లో Device information ను ఎంచుకోండి.
  3. Device information స్క్రీన్ నందు గలMore Informationను నొక్కండి.
  4. ముందుగ Reset phone బటన్ నొక్కండి. తరువాత Resetబటన్ పై నొక్కి రీసెట్ ని నిర్ధారించండి .

మీరు ఇంతకు ముందుగా కొనుగోలు చేసిన ఆప్ లను మార్కెట్ ప్లేస్ నందు సైన్ ఇన్ చేసి మై అప్ప్స్ విభాగం లో తిరిగి ఇన్స్టాల్ చేయవచ్చు. మరిన్ని వివరాల కోసం What is the Marketplace?

మీరు మీ పరికరాన్ని మాములుగా రీసెట్ చెయ్యలేని పక్షం లో "హార్డ్ రీసెట్" చెయ్యాలి.

  1. మీ పరికరం ఆఫ్ లో ఉంది అని నిర్ధారించుకోండి. మీరు సాధారణంగా దాన్ని ఆఫ్ చెయ్యలేకపోతే అప్పుడు బ్యాటరీ ని తొలగించి ఆఫ్ చెయ్యండి.
  2. మీరు రీసెట్ స్క్రీన్ చూసేవరకు ఒకే సమయంలో పవర్ , వాల్యూమ్ అప్ మరియు హోమ్ బటన్ను నొక్కి పట్టుకోండి.
  3. మీ పరికరం యొక్క రీసెట్ ని కొనసాగించడానికి పై వాల్యూం బటన్ నొక్కండి.

అదనపు సహాయాన్ని పొందండి లేదా మీ అభిప్రాయాల్ని పంపండి

మీరు ఈ దశలను ఉపయోగించుకోవటం లో ఏదైనా ఇబ్బంది కలిగినా లేక ఇది మీ పరికరం లోని సమస్య ను పరిష్కరించాకపోయినా మీరు మీ పరికరం కొనుగోలు చేసిన చోట సంప్రదించండి లేదా ask our volunteer community for help

మొజిల్లా కమ్యూనిటీ ఫైరుఫాక్సు ఓఎస్ ను మెరుగుపరచడానికి మీ అభిప్రాయాన్ని ఉపయోగిస్తుంది.

మీ అభిప్రాయాన్ని పంపడానికి:

  1. సెట్టింగ్ల ఆప్ ని తెరవండి.
  2. క్రిందికి స్క్రోల్ చేసి Device విభాగం నందు గల Improve Firefox OSను ఎంచుకోండి.
  3. ఇప్పుడు Send Mozilla Feedback బటన్ ని నొక్కండి.
  4. ఫైరుఫాక్సు ఓఎస్ ను గురించి మీ ఉద్దేశం తెలుపుటకుHappy లేదా Sad చిహ్నం పై నొక్కండి..
  5. తదుపరి స్క్రీన్ పై మీ వ్యాఖ్యలను ఎంటర్ చెయ్యండి.
  6. చివరగాSend Feedbackబటన్ నొక్కండి . మీరు ఫైరుఫాక్సు ఓఎస్ అభివృద్ధికి సాయపడ్డారు !

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి