ప్రైవేట్ బ్రౌజింగ్ - చరిత్రను సేవ్ చేయకుండా ఫైర్ఫాక్స్ ఉపయోగించండి

రివిజన్ సమాచారం
  • రివిజన్ id: 166109
  • సృష్టించబడింది:
  • సృష్టికర్త: చిలాబు
  • వ్యాఖ్య: final
  • పరిశీలించినవి: కాదు
  • స్థానికీకరణ కోసం సిద్ధంగా ఉన్నది: కాదు
రివిజన్ మూలం
రివిజన్ కంటెంట్

మీరు జాల విహరణ చేసేటప్పుడు, ఫైర్‌ఫాక్స్ మీ కోసం మీరు సందర్శించిన సైట్లు వంటి చాలా సమాచారాన్ని గుర్తుంచుకుంటుంది. అయితే కొన్ని సార్లు మీరు ఒక బహుమతిని జాలలో కొనడం లాంటివి మీ కంప్యూటరును వాడుకునే ఇతర వ్యక్తులు చూడకూడదు అనుకోవచ్చు. రహస్య విహరణ అనేది మీరు ఏయే సైట్లను, పేజీలను చూసారో వాటి వివరాలు ఏవీ భద్రపరచకుండా జాల విహరణ చేయడాన్ని సుగమం చేస్తుంది.

రహస్య విహరణ ప్రైవేట్ బ్రౌజింగ్ లో ట్రాకింగ్ రక్షణని కూడా కలిగి ఉండటం వలన సంస్థలు వివిధ సైట్ల ద్వారా మీ జాల విహరణ చరిత్రను అనుసరించకుండా అడ్డుకుంటుంది. అనుసరణ రక్షణతో కూడిన రహస్య విహరణ గురించి మరింత తెలుసుకోవడానికి ప్రైవేట్ బ్రౌజింగ్ లో ట్రాకింగ్ రక్షణ చూడండి.

అది ఎలా పనిచేస్తుందో మీకు తెలియజేస్తాము.

ముఖ్యమైనది: రహస్య విహరణ మిమ్మల్ని జాలలో అనామకునిగా చేయలేదు. అయితే, మీ జాల సేవా సంస్థ, మీ యజమాని లేదా సైట్లు వాటంతట అవే మీరు ఏ పేజీలను చూసారో తెలుసుకోవచ్చు. రహస్య విహరణ మిమ్మల్ని మీ కంప్యూటర్లో స్థాపించబడియున్న కీలాగర్లు లేదా స్పైవేర్ నుండి కూడా రక్షించలేదు.

నేను ఒక కొత్త రహస్య విహరణ విండో ఎలా తెరవవచ్చు?

ఒక కొత్త రహస్య విహరణ విండో తెరవడానికి రెండు మార్గాలు ఉన్నాయి.

కొత్త, ఖాళీ రహస్య విహరణ విండో తెరువు

  • New Fx Menu మెను బొత్తాన్ని నొక్కండి. ఆపై New Private Window నొక్కండి.
    private browsing - fx29 - winxpprivate browsing - fx29 - win8private browsing - fx29 - macprivate browsing - fx29 - linuxprivate tab menu 57 winprivate tab menu 57private tab menu 57 linux

కొత్త రహస్య విహరణ విండోలో లంకెను తెరువు

  • కుడి క్లిక్అది నొక్కే ముందు Ctrl నొక్కి ఉంచండి ఏ లంకెపైనైనా మరియు విషయ మెనూ నుండి Open Link in New Private Window ఎంచుకోండి.
    Link in Private Window Fx20 WinXPLink in Private Window Fx20 Win7Link in Private Window Fx20 MacLink in Private Window Fx20 Lin
చిట్కా: రహస్య విహరణ విండోల పైభాగాన ఒక ఊదా ముసుగు ఉంటుంది.
Mask - WinXPMask - Win8Mask - MacMask - Linuxprivate mask 57 winprivate mask 57private mask 57 linux

రహస్య విహరణ ఏమి భద్రపరచదు?

  • చూసిన పేజీలు: చరిత్ర మెనులో సైట్ల జాబితాకు, లైబ్రరీ విండో యొక్క చరిత్ర జాబితాకు, లేదా పరమాద్భుతం బార్ చిరునామా జాబితాకు పేజీలు చేర్చబడవు.
  • ఫారం, శోధన బార్ నమోదులు: వెబ్ పేజీల్లోని టెక్స్ట్ బాక్సుల్లో లేదా శోధన బార్లో మీరు నమోదు చేసినవి ఫారం స్వయంపూరణ కొరకు భద్రపరచబడవు.
  • పాస్‌వర్డ్‌లు: కొత్త పాస్‌వర్డ్‌లు భద్రపరచబడవు.
  • దింపుకోలు జాబితా నమోదులు: రహస్య విహరణను ఆపివేసిన తరువాత మీరు దింపుకున్న దస్త్రాలు ఏవీ దింపుకోళ్ళ విండోలో చూపించబడవు.
  • కుకీలు: కుకీలు మీరు సందర్శించిన వెబ్ సైట్ల గురించి సైట్ ప్రాధాన్యతలు, లాగిన్ స్థితి, మరియు అడోబె ఫ్లాష్ వంటి ప్లగిన్లు ఉపయోగించే డేటా వంటి సమాచారాన్ని భద్రపరుస్తాయి. అన్యవ్యక్తులు మిమ్మల్ని వివిధ వెబ్సైట్ల ద్వారా అనుసరించడానికి కూడా కుకీలు ఉపయోగపడతాయి. మరింత సమాచారం కోసం నేను Do Not Track ఫీచర్ ను ఎలా ఆన్ చేయాలి? చూడండి. రహస్య విండోలలో సెట్ చేయబడిన కుకీలు మామూలు విండో కుకీలకంటే వేరుగా ఉండి, తాత్కాలికంగా మెమొరీలో ఉంచబడి, మీ రహస్య సెషన్ ముగిసినపుడు (చివరి రహస్య విండో మూసివేయబడినపుడు) తీసివేయబడతాయి.
  • దాచబడ్డ వెబ్ కంటెంట్, జతపరచని వెబ్ కంటెంట్ మరియు యూజర్ డేటా: తాత్కాలిక జాల దస్త్రాలు (దాచబడ్డ దస్త్రాలు) లేదా జతపర్చని వినియోగం కోసం వెబ్సైట్లు భద్రపరిచే దస్త్రాలు - ఇవి ఏవీ భద్రపరచబడవు.
గమనిక:
  • రహస్య విహరణ ఉపయోగించి మీరు రూపొందించే కొత్త బుక్‌మార్కులు భద్రపరచబడతాయి.
  • రహస్య విహరణ ఉపయోగించి మీరు మీ కంప్యూటరుకు దింపుకునే ఏ దస్త్రాలైనా భద్రపరచబడతాయి.

ఫైర్‌ఫాక్స్ ఎల్లప్పుడూ రహస్య విహరణను వాడేలా అమర్చుకోవచ్చా?

ఫైర్‌ఫాక్స్ చరిత్రను గుర్తుంచుకునేలా అప్రమేయంగా అమర్చబడుతుంది, కానీ మీరు ఫైర్‌ఫాక్స్ గోప్యతలో ఈ అమరికను మార్చవచ్చు ఎంపికలుప్రాధాన్యతలు (New Fx Menu ఫైర్‌ఫాక్స్ మెనుపై నొక్కండి, OptionsPreferences ఎంచుకోండి, PrivacyPrivacy & Security ప్యానెల్ ఎంచుకోండి). మీరు మీ చరిత్ర అమరికను "ఎప్పుడూ చరిత్రను గుర్తుంచుకోవద్దు"గా మారిస్తే, ఇది రహస్య విహరణ రీతిలో ఉండడంతో సమానం. మరిన్ని వివరాలకోసం గోప్యతా, బ్రౌజింగ్ చరిత్ర మరియు ట్రాక్ చేయద్దు కోసం సెట్టింగులు చూడండి.

ముఖ్యమైనది: ఫైర్‌ఫాక్స్‌లో ఎప్పుడూ చరిత్రను గుర్తుంచుకోవద్దు అనే అమరికను వాడినపుడు మీరు రహస్య విహరణ రీతిలో ఉన్నప్పటికీ మీకు ప్రతి విండో పైభాగాన ఊదా ముసుగు కనబడదు. సాధారణ విహరణను పునరుద్ధరించడానికి మీ గోప్యతకి వెళ్లండి ఎంపికలుప్రాధాన్యతలు మరియు ఫైర్‌ఫాక్స్ చరిత్రను గుర్తుపెట్టుకో ను అమర్చుకోండి.

ఫైర్‌ఫాక్స్ భద్రపరిచే సమాచారాన్ని నియంత్రించడానికి ఇతర మార్గాలు