ఫైర్‌ఫాక్స్‌ను సరికొత్త వెర్షనుకు తాజాకరించుకోవడం | ఎలా

ఫైర్‌ఫాక్స్‌ను సరికొత్త వెర్షనుకు తాజాకరించుకోవడం

అప్రమేయంగా, ఫైర్‌ఫాక్స్ స్వయంచాలకంగా తనంత తానే తాజాకరించుకుంటుంది, కానీ మీరు మానవీయంగా కూడా తాజాకరించుకోవచ్చు. మానవీయ తాజాకరణ ఇంకా ఫైర్‌ఫాక్స్ తాజాకరణను దింపుకోలు చేయనిస్తుంది కానీ మీరు ఫైర్‌ఫాక్స్‌ను పునఃప్రారంభించేవరకు దానిని స్థాపించదు.

అది చేయు విధానం ఇది:

గమనిక : మీ లినక్స్ పంపిణీతో పాటు వచ్చిన ఫైర్‌ఫాక్స్ ప్యాకేజీని మీరు వాడుతుంటే గనక, తాజాకరించిన ప్యాకేజీ మీ పంపిణీ వారి రిపాజిటరీ లోనికి విడుదలయ్యే వరకూ వేచివుండాలి. మీరు ఫైర్‌ఫాక్స్‌ను (మీ పంపిణీ వారి ప్యాకేజీ మేనేజరు వాడకుండా) మానవీయంగా స్థాపించుకొని ఉంటే మాత్రమే ఈ వ్యాసం వర్తిస్తుంది.
  1. మెనూ బొత్తాన్ని New Fx Menu Fx57Menu నొక్కండి, సహాయం Help-29 Fx57Help సహాయం నొక్కి Firefox గురించి ఎంచుకోండి.మెనూ బారులో Firefox మెనూ నొక్కి Firefox గురించి ఎంచుకోండి.
  2. Mozilla Firefox గురించిFirefox గురించి విండో తెరుచుకుంటుంది. ఆటోమెటిగ్గా ఫైర్‌ఫాక్స్ తాజాకరణల కోసం చూసి వాటిని దించుకుంటుంది.
    AboutFx50Downloading Fx59AboutFirefox-downloadingWin about-Fx59-downloading
  3. తాజాకరణలు స్థాపనకు సిద్ధమైనప్పుడు, Firefox‌ను తాజాకరించడానికి పునరుద్ధరించండిFirefox‌ను తాజాకరించడానికి పునరుద్ధరించండి బొత్తాన్ని నొక్కండి.
    AboutFx50Restart Fx59AboutFirefox-RestartWin about-Fx59-restart Fx57RestartToUpdate-Mac
ముఖ్యమైనది: ఒకవేళ తాజాకరణ మొదలవకపోయినా, పూర్తికాకపోయినా లేదా మరేదైనా సమస్య వచ్చినా, మీరు వ్యవస్థలు & భాషల పేజీకి వెళ్ళి మీ నిర్వాహక వ్యవస్థ, భాష కొరకు సరికొత్త ఫైర్‌ఫాక్స్ వెర్షనును దించుకొని స్థాపించుకోవచ్చు లేదా ఈ దింపుకోలు లంకెను కూడా వాడుకోవచ్చు (మరింత సమాచారం కోసం విండోస్‌లో ఫైర్‌ఫాక్సుని ఎలా దించుకుని స్థాపించుకోవాలి?లినక్స్‌లో ఫైర్‌ఫాక్స్ స్థాపించుకోవడంమాక్ లో ఫైర్‌ఫాక్స్ దింపుకోలు మరియు స్థాపితం చేయు విధానం చూడండి).

భద్రంగా ఉండండి: మోసపూరిత అనువర్తనాల బారిన పడకుండా ఉండేందుకు పైన ఇచ్చిన అధికారిక మొజిల్లా లంకెల నుండి మాత్రమే దించుకోండి.

ఫైర్‌ఫాక్స్ ఎంపికలుప్రాధాన్యతలు లో తాజాకరణ అమరికలను మార్చుకోవచ్చు. మెనూ బొత్తం New Fx Menu Fx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి. సాధారణం ప్యానెలులో, Firefox తాజాకరణలు విభాగం కొరకు క్రిందికి స్క్రోల్ చెయ్యండి.

ఈ వ్యాసం, తతిమా ఫైర్‌ఫాక్స్ తోడ్పాటు లానే, మీకు దాదాపు ఔత్సాహికుల ద్వారానే అందించబదుతుంది, వీరివల్లే మొజిల్లా స్వతంత్ర్యంగా, స్వేచ్ఛాయుతంగా ఉండగలుగుతుంది. స్వేచ్ఛగా విహరిస్తూ ఉండండి!

ఈ వ్యాసం ఉపయోగపడిందా?

దయచేసి వేచివుండండి…

// These fine people helped write this article:వీవెన్, JAYANTH , sriharshakolluru, Dinesh, చిలాబు. You can help too - find out how.

చివరి నవీకరణ: 2018-11-24

మరో వేదిక కోసం మద్దతు పొందండి:
ఈ వ్యాసమును అనుకూలీకరించండి

Firefox