విండోస్‌లో ఫైర్‌ఫాక్సుని ఎలా దించుకుని స్థాపించుకోవాలి?

(How to download and install Firefox on Windows నుండి మళ్ళించబడింది)

ఈ వ్యాసం విండోస్‌లో ఫైర్‌ఫాక్సుని ఒక సరళ ఆన్లైన్ సంస్థాపకి ద్వారా ఎలా దింపుకుని, స్థాపించుకోవాలో వివరిస్తుంది. (ఎక్కువ తెలిసిన వాడుకరులు: వ్యాసం చివర ఉన్న For advanced users విభాగం చూడండి.)

ఈ వ్యాసం విండోస్ కి మాత్రమే వర్తిస్తుంది. మాక్ లో ఫైర్‌ఫాక్సును స్థాపించుటకు సూచనల కోసం మాక్ లో ఫైర్‌ఫాక్స్ దింపుకోలు మరియు స్థాపితం చేయు విధానం చూడండి.లీనక్స్‌లో ఫైర్‌ఫాక్సును స్థాపించుటకు సూచనల కోసం లినక్స్‌లో ఫైర్‌ఫాక్స్ స్థాపించుకోవడం చూడండి.

ఫైర్‌ఫాక్సును స్థాపించుటకు ముందు సిస్టమ్ ఆవశ్యకతలు చూసి కావలసిన నిర్వాహక వ్యవస్థ, సిఫారసు చేయబడిన హార్డ్‌వేర్ మీ కంప్యూటరుకు ఉందని నిర్ధారించుకోండి..

ఒక పరిమిత విండోస్ XP ఖాతా ఉపయోగించి ఫైర్‌ఫాక్సును స్థాపించవద్దు. మరింత సమాచారం కోసం మైక్రోసాఫ్ట్ మద్దతు వ్యాసం How to determine your user account type in Windows చూడండి.

  1. ఈ ఫైర్‌ఫాక్సు దింపుకోలు పేజీని మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్ష్ప్లోరర్ లేదా మైక్రోసాఫ్ట్ ఎడ్జి వంటి ఏదేని విహారిణిలో సందర్శించండి.
  2. Download Now బొత్తాన్ని నొక్కండి. దింపుకోలు చేసుకునే ఫైర్‌ఫాక్సు సంస్థాపకి స్వయంచాలకంగా మీ కంప్యూటరు కొరకు లభ్యమయ్యే ఉత్తమ ఫైర్‌ఫాక్సు రూపాంతరాన్ని సిఫార్సు చేస్తుంది.
    Download-Firefox-Win10
    • మీరు మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్ష్ప్లోరర్ లేదా మైక్రోసాఫ్ట్ ఎడ్జి ఉపయోగిస్తే, పేజీ దిగువన ఒక నోటిఫికేషన్ బార్లో సంస్థాపకి అమలు లేదా ఫైలును మీ కంప్యూటర్లో భద్రపరచుకొనుటకు ఎంపికలతో కనపడుతుంది. ప్రక్రియను ప్రారంభించుటకు Runని నొక్కండి.
    • ఇతర విహారిణులలో మీరు మొదట ఫైర్‌ఫాక్సు సంస్థాపకిని మీ కంప్యూటరులో భద్రపరచాలి, తదుపరి మీరు దింపుకోలు చేసుకున్న ఫైలును తెరవాలి.
      గమనిక: మీరు గనక "తెరచిన ఫైలు - భద్రతా హెచ్చరిక" డయలాగ్ చూసినట్లైతే Open లేదా Runపై నొక్కండి.
    Firefox-60-open-file-warning-win10
  3. మిమ్మల్ని మీ కంప్యూటర్లో ఫైర్‌ఫాక్సు సంస్థాపకి చేయు మార్పులకు అనుమతిని అడుగుటకు "వాడుకరి ఖాతా నియంత్రణ" డయలాగ్ తెరచుకోవచ్చు. ఈ డయలాగ్ కనపడితే, స్థాపన మొదలుపెట్టుటకు Yesపై నొక్కండి.
    Firefox-Installer-win10-UAC
  4. ఫైర్‌ఫాక్సు స్థాపనను ముగించేవరకు వేచియుండండి.
    Firefox-60-Installer
    గమనిక: చాలా పాత ఫైర్‌ఫాక్సు రూపాంతరం లేదా చాలా పాత ప్రొఫైలు సమాచారం కనుగొన్నట్టైతే ఫైర్ఫాక్సు సంస్థాపకి ఒక నవీకరణ లేదా పునఃస్థాపన బొత్తము మరియు అప్రమేయ అమరికలను పునరుద్ధరించుటకు, పొడగింతలను తొలగించుటకు ఎంపికను కలిగియుండవచ్చు. పాత సమాచారాన్ని ఉంచుటకు చెక్‌బాక్సు ఎంపికను తీసివేసి Update లేదా Re-installపై నొక్కి స్థాపనను మొదలుపెట్టవచ్చు.
    FirefoxInstaller-Reinstall
  5. స్థాపన పూర్తి అయిన తరువాత ఫైర్‌ఫాక్సు తెరచుకుంటుంది.
అభినందనలు, మీరు ఫైర్‌ఫాక్సు స్థాపన పూర్తిచేశారు! మీరు ఆన్లైనుకు వెళ్లాలనుకున్నప్పుడు మొజిల్లా ఫైర్‌ఫాక్సు ప్రతీకంపై రెండుసార్లు నొక్కండి.
Firefox-Icons-Win10

సమస్యలు ఉన్నాయా?

ఈ క్రింద మీకు సహాయపడే వ్యాసాలు ఉన్నాయి:

ఎక్కువ తెలిసిన వాడుకరులకోసం

ఫైర్‌ఫాక్సు దింపుకోలు పేజీ]లోని Download Now బొత్తము మీ నిర్వాహక వ్యవస్థకు అనుకూలమైన ఫైర్‌ఫాక్సు రూపాంతరాన్ని స్వయంచాలకంగా స్థాపించగల ఒక క్రమబద్ధమైన ఆన్లైను సంస్థాపకిని సమకూరుస్తుంది. ఉదాహరణకు, 64-బిట్ విండోస్పై సంస్థాపకి 64-బిట్ ఫైర్‌ఫాక్సు రూపాంతరం కోసం (వివరాలు ఇక్కడ).

మీరు ఒక పూర్తి ఆఫ్లైను సంస్థాపకి, వేరే నిర్వాహక వ్యవస్థలో ఒక ఫైర్‌ఫాక్సు రూపాంతరం (64-బిట్ విండోస్‌లో 32-బిట్ ఫైర్‌ఫాక్సు), లేదా మీరు ఫైర్‌ఫాక్సు స్థాపనను అనుకూలీకరించుటకు ఫైర్‌ఫాక్సు దింపుకోలు పేజీలో Advanced Install Options & Other Platforms లంకె ఉపయోగించండి. మీ స్వంత భాషను ఉపయోగించడానికి వేరే భాషలో దింపుకోండి లంకె ఉపయోగించండి.

పూర్తి, ఆఫ్లైను సంస్థాపకిలో ఉన్న ఎంపికలు Custom installation of Firefox on Windows అనే వ్యాసంలో వివరించబడ్డాయి.

ఈ వ్యాసం ఉపయోగపడిందా?

దయచేసి వేచివుండండి…

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి