మాక్ లో ఫైర్ఫాక్స్ డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయడం ఎలా

(Install Firefox on Mac నుండి మళ్ళించబడింది)

ఈ వ్యాసం మాక్ లో ఫైరుఫాక్సు డౌన్లోడ్ మరియు ఏలా ఇన్స్టాల్ చేయాలో వివరిస్తుంది.

Note: ఈ వ్యాసం మాక్ కు మాత్రమే వర్తిస్తుంది. విండోస్ లో ఫైర్ఫాక్స్ ఇన్స్టాల్ చేయడానికి సూచనల కోసం, చూడండి విండోస్ లో ఫైరుఫాక్సు ని ఎలా డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయాలి.లైనక్స్ లో ఫైర్ఫాక్స్ ఇన్స్టాల్ చేయడానికి సూచనల కోసం, చూడండి Linux పై ఫైర్ఫాక్స్ ఇన్స్టాల్.
ఫైర్ ఫాక్సు కి ఇంటెల్ ప్రాసెసర్ మరియు మాక్ OS X 10.6 లేదా పైన అవసరం.అన్నింటిని కావాల్సిన అవసరాలు చూడండి.మీరు ఒక పాత Mac OS వెర్షన్ ఉపయోగిస్తే, సహాయం కోసం చూడండి ఫైర్ఫాక్స్ ఇకపై మాక్ OS X 10.4 లేదా పవర్ పిసి ప్రాసెసర్లు లో పనిచేయదు లేదా ఫైర్ఫాక్స్ ఇకపై మాక్ OS X 10.5లో పనిచేయదు.

మాక్ లో ఫైరుఫాక్సు ఇన్స్టాల్ చేయుట

 1. ఏ బ్రౌజర్ లో ఫైర్ఫాక్స్ డౌన్లోడ్ పేజీ (ఉదాహరణకు, ఆపిల్ సఫారి)అయినా సందర్శించండి. ఇది స్వయంచాలకంగా మీ కంప్యూటర్లో వేదిక మరియు భాష గుర్తించి మరియు మీ కోసం ఫైర్ ఫాక్సు యొక్క ఉత్తమ వెర్షన్ ను సిఫార్సు చేస్తుంది.
 2. Click the green download button to download Firefox.
  download page mac
 3. డౌన్లోడ్ గనుక పూర్తి అయ్నచో, ఈ (Firefox.dmg) ఫైల్ తనకు తనే ఓపెన్ అయ్యుది ఫైరుఫాక్సు అప్లికేషను కలిగి వున్నా ఫైండర్ విండో ఓపెన్ అవ్తుంది. ఫైరుఫాక్సు ఐకాన్ ను అప్లికేషన్స్ ఫోల్డర్లో కాపీ చేయుటకు ఐకాన్ ని డ్రాగ్ చేసి ఫోల్డర్లో వేయవలెను .
  Mac Install 2a
  గమనిక: ఈ విండోను మీరు చూడకపోతే , మీరు తెరవడానికి డౌన్లోడ్ Firefox.dmg ఫైలు క్లిక్ చేయండి .
  Mac Install 2
 4. అప్లికేషన్స్ ఫోల్డర్కు ఫైరుఫాక్సు ను డ్రాగ్ చేసిన తర్వాత , విండో లో క్లిక్ చేస్తునపుడు ఈ controlకీ ని హోల్డ్ చేసి పెట్టుకోండి మరియు ఈ Eject "Firefox" మెనూ నుండి ఎంచుకోండి .
  Mac Install 4
 5. మీరు సులభంగా యాక్సెస్ కోసం మీ డాక్ కు Firefox జోడించవచ్చు. మీ అప్లికేషను ఫోల్డర్లో తెరిచి డాక్ కు ఫైరుఫాక్సు ను డ్రాగ్ చేయండి .
  Add to Dock
  ఫైరుఫాక్సు ఇప్పుడు వినియోగానికి సిద్దంగా వున్నది. దీనిని ప్రారంభించడానికి డాక్ లో దాని యొక్క ఐకాన్ ని క్లిక్ చేయండి .

ఫైరుఫాక్సు ను మొదటి సరి స్టార్ట్ చేయనికి

మీరు మొదటి సారిగా ఫైరుఫాక్సు ను ప్రారంభించినప్పుడు, మీరు ఇంటర్నెట్ నుండి ఫైరుఫాక్సు చేసారని హెచ్చరిస్తుంది. మీరు అధికారిక సైట్ నుండి ఫైరుఫాక్సు డౌన్లోడ్ కు , మీరు ఈ Open బటన్ ను క్లిక్ చెయ్యవచ్చు.

Firefox Downloaded Security Check Mac

అలాగే, ఫైరుఫాక్సు మీ డిఫాల్ట్ బ్రౌజర్ కన్నప్పుడు మీకు దాని గురించి గుర్తు చేస్తుంది. మీరు మీ మెయిల్ అప్లికేషన్ లో ఒక లింక్, ఒక ఇంటర్నెట్ సత్వరమార్గం, లేదా HTML పత్రం తెరిచినప్పుడు, ఫైరుఫాక్సు లో తెరుచుకోదు అని అర్థం. ఫైరుఫాక్సు గనక ఆ పనులు చేయాలి అని మీరు బావిన్చినచో , ఈ Use Firefox as my default browser బటన్ ని క్లిక్ చేస్తే ఫైరుఫాక్సు మీ డిఫాల్ట్ బ్రౌజరుగ సెట్ చేయబడుతుంది . లేనిచో మీరు ,ఈ Not now బటన్ ను క్లిక్ చేయండి .

Firefox as Default Browser Dialogue Mac

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

jayanth157, DineshMv ఈ మంచి ప్రజలు ఈ వ్యాసం వ్రాయడంలో సహాయం చేశారు. మీరు కూడా సహాయం చేయవచ్చు - ఎలానో కనుగొనండి.