ఆండ్రాయిడ్ కోసం ఫైర్ఫాక్సులో ప్రైవేట్ బ్రౌజింగ్

మీ చరిత్ర, పాస్‌వర్డ్‌లను లేదా సైట్ ప్రాధాన్యతలను సేవ్ చేయకుండా వెబ్ పేజీలను సందర్శించడానికి ఆండ్రాయిడ్ కోసం ఫైర్ఫాక్సులో ప్రైవేట్ టాబ్‌ను ఉపయోగించుము.

ప్రైవేట్ బ్రౌజింగ్ ఏమి సేవ్ చేయదు?

 • సందర్శించిన పేజీలు
 • ఫారంలు మరియు శోధన ఎంట్రీలు
 • పాస్వర్డ్లు
 • డౌన్ లోడ్ లు (డౌన్లోడ్ అయిన ఫైళ్ళు ఇంకా మీ పరికరంలో సేవ్ అవుతాయి, కానీ అవి ఫైర్ఫాక్సు యొక్క డౌన్లోడ్ చరిత్రలో కనిపించవు)
 • కుకీలు
 • తాత్కాలిక ఇంటర్నెట్ ఫైళ్లు (కాష్ చేసిన ఫైళ్లు)

ఆండ్రాయిడ్ కోసం ఫైరెఫాక్సుతో ఒక నిజమైన ప్రైవేట్ బ్రౌజింగ్ అనుభవాన్ని పొందండి. ప్రైవేట్ టాబ్‌ను ఉపయోగించి గుర్తించడం లేదా ట్రాకులు లేకుండా వెబ్ సైట్ లను సందర్శించండి. ప్రైవేట్ బ్రౌజింగ్:

 • చరిత్ర, పాస్‌వర్డ్‌లను మరియు ఎంట్రీలు సేవ్ చేయకుండా అడ్డుకుంటుంది
 • ఫార్మ్ల్ లో మరియు శోధన ఖాళీలను స్వయం పూరించడాన్ని ఆపు
 • కుక్కీలని బ్లాక్ చేస్తుంది
 • తాత్కాలిక ఇంటర్నెట్ ఫైళ్లు నిరోధించును
 • మీరు సందర్శించే వెబ్ పేజీల్లో మూడవ పార్టీ ట్రాకింగ్ అంశాలు బ్లాక్ చేస్తుంది (చిట్కా: మీరు ఏ సమయంలో అయినా దీన్ని ఆపివేయవచ్చు. చూడండి ఆండ్రాయిడ్ కోసం ఫైర్ఫాక్సు ట్రాకింగ్ రక్షణ)

ఒక ప్రైవేట్ టాబ్ తెరువు

 • ఒక ఖాళీ, ప్రైవేట్ టాబ్ తెరువు: ఫైర్ఫాక్సు బటన్ నొక్కండి Menu (ఇదైనా కొన్ని పరికరాల్లో స్క్రీన్ క్రింద లేదా బ్రౌజర్ యొక్క కుడి ఎగువ మూలలో వద్ద) , ఆపై నొక్కండి New Private Tab.
 • ఒక ప్రైవేట్ టాబ్ లో లింక్‌ను తెరువు: ఒక మెను తీసుకురావటానికి మరియు ఎంచుకోవడానికి ఒక లింక్‌పై దీర్ఘగా నొక్కండి Open link in Private Tab.

ఓపెన్ ప్రైవేట్ ట్యాబ్‌లు చూడండి

మీ స్క్రీన్ ఎగువన టాబ్ చిహ్నాన్ని నొక్కండి,అప్పుడు మీరు ప్రైవేట్ బ్రౌజింగ్ లో తెరిచిన సైట్లు వీక్షించడానికి ముసుగు చిహ్నాన్ని నొక్కండి.

private tabs m36 private browsing

ఒక టాబ్ మూసివేయడానికి, మీరు మూసివేయాలనుకున్న టాబ్ పక్కన X బటన్ నొక్కండి. మీరు మెను బటన్ నొక్కడం ద్వారా అన్ని తెరిచిన ట్యాబ్‌లను మూసివేయవచ్చు,తర్వాత Close Private Tabs.

హెచ్చరిక: ప్రైవేట్ బ్రౌజింగ్ మీరు ఇంటర్నెట్ గుర్తుతెలియనివ్వకుండా ఉండనివ్వదు. మీ అంతర్జాలిక సేవా ప్రదాత, యజమాని (ఉదాహరణకు, మీ యజమాని యొక్క వైఫై ఉపయోగించి ఉంటే),లేదా సైట్లు తాము ఇప్పటికీ మీరు సందర్శించే పేజీలు ట్రాక్ చేయవచ్చు.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

DineshMv ఈ మంచి ప్రజలు ఈ వ్యాసం వ్రాయడంలో సహాయం చేశారు. మీరు కూడా సహాయం చేయవచ్చు - ఎలానో కనుగొనండి.