ఐఓఎస్(రూపాంతరణ 7) కోసం రూపొందించిన ఫైర్‌ఫాక్స్ ఫోకస్ లో కొత్తగా ఏమున్నాయి?

ఈ వ్యాసం చాలా కాలంగా నిర్వహించబడలేదు, కాబట్టి దాని కంటెంట్ పాతది అయ్యుండవచ్చు.

రూపాంతరం: 7
విడుదల తేదీ: సెప్టెంబర్ 19, 2018

ఫైర్‌ఫాక్స్ ఫోకస్ యొక్క ఈ రూపాంతరం బగ్ ఫిక్సెస్‌తో మరియు కొత్త డిజైన్‌తో ఐఓఎస్ 12కు అనుకూలంగా రూపొందించబడింది. అందులో కొన్ని విశేషాంశాలు:

  • ఐఫోన్ మరియు ఐపాడ్ ల స్క్రీనుకు అనుకూలమైన పోర్‌ట్రెయిట్, లాండ్‌స్కేప్ రెండు స్క్రీను పరివర్తనలకు అనుకూలమైన సరికొత్త URL బార్ డిజైన్.
  • "పేజీ చర్యల"కు ఒక కొత్త మెను. ఇది చూడండి Page Actions in Firefox Focus.
  • మార్గనిర్దేశకత్వం మరియు అమరికల బొత్తాలు ఇప్పుడు ప్రతి స్క్రీనులోనూ కనబడతాయి.
  • ఫైర్‌ఫాక్స్ ఫోకస్ ఇక ఐఓఎస్ 12లో పనిచేస్తుంది.
  • మీరు ట్రాకింగ్ ప్రొటెక్షన్ బ్యాడ్జిని తట్టినప్పుడు ఐపాడ్‌లకు అనుకూలంగా మలిచిన మెరుగైన మెను.
  • సహకారమున్న ఉపకరణాలలో మీరు త్రీడీ టచ్‌ను వాడినపుడు ఎరేజ్ & ఓపెన్ ఐచ్ఛికము కనిపిస్తుంది.
  • ఐఓఎస్ 12 లో సిరి షార్ట్‌కట్‌లు ఇక పని చేస్తాయి: సిరిని అడగండి: మీ
    • ఇష్టమైన వెబ్‌సైట్‌ను జత పరిచి, దానిని తెరవండి
    • ఫైర్‌ఫాక్స్ ఫోకస్‌ను తుడిచివేసి తిరిగి తెరవండి
    • పూర్వరంగంలో తుడిచివేయండి.
  • మీ ప్రస్తుత సెషన్‌ను తుడిచివేయకుండా అమరికల మెనుకు వెళ్ళగలుగుతారు.
  • సూచిత ఫీచర్లు కలిగిన ఉపయోగకరమైన స్క్రీన్‌టిప్‌లు కొందరు ఎంపిక చేసిన వాడుకరులకు కనిపిస్తాయి.

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి